సమావేశానికి గైర్హాజరై 15మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉoడటo సరికాదని ముగింపు సందేశంలో గట్టిగా క్లాస్ పీకారు. ఆహ్వానితుల్లో 56మంది గైర్హాజరయ్యారంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఎంత మంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంత మంది వెళ్లిపోయారు, సమావేశం చివరి వరకూ ఎంత మంది ఉన్నారో అందరి లెక్కలు తన వద్ద ఉన్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుందని గట్టిగా చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటి టీడీపీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
READ MORE: Uppu Kappurambu : 28 రోజుల్లోనే షూట్ కంప్లీట్.. కీర్తి సురేష్, సుహాస్ కామెంట్స్
కొంతమంది ఎమ్మెల్యే లు పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు కనీసం పక్కన కూడా ఉండడం లేదన్నారు సీఎం చంద్రబాబు.. పెన్షన్ ఇచ్చేటప్పుడు కనీసం ఓపికగా నిలబడాలని ఎమ్మెల్యే లకు సూచించారు. పాపులర్ ఎమ్మెల్యే లకు రాంక్స్ ఇస్తామన్నారు. కొంతమంది మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యే లు ఏమి చెయ్యాలో తనకే చెప్తున్నారని నవ్వుతూ వ్యాఖ్యానించారు సీఎం. జనం లోకి వెళ్లి చెప్పకపోతే అబద్ధాలు చక్కర్లు కొడతాయని సూచించారు.
READ MORE: Maharashtra: హిందీ ‘విధింపు’పై వ్యతిరేకత.. కీలక నిర్ణయం తీసుకున్న మహరాష్ట్ర సర్కార్..