Today Business Headlines 23-03-23: అల్లు అర్జున్ బ్రాండ్ వ్యాల్యూ: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ వ్యాల్యూ 260 కోట్ల రూపాయలని ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థ క్రోల్ పేర్కొంది. ఇండియాలో అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన పాతిక మందిలో పుష్పరాజ్‌కి కూడా చోటు లభించింది. ఈ లిస్టులో అల్లు వారి వారసుడికి స్థానం దక్కటం ఇదే మొదటిసారి. 2022వ సంవత్సరానికి సంబంధించిన సెలెబ్రిటీ బ్రాండ్ వ్యాల్యుయేషన్ స్టడీ రిపోర్టును ఈ కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఇందులో అల్లు అర్జున్ 20వ…
Today Stock Market Roundup 21-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇవాళ మంగళవారం మంచి జోష్ కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రేడింగ్ పాజిటివ్‌గానే నడిచింది. పాశ్చాత్య దేశాల్లో బ్యాంకింగ్ సంక్షోభానికి సంబంధించిన భయాలు తగ్గుముఖం పట్టడం మన మార్కెట్‌కి కలిసొచ్చింది. దీంతో ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ మళ్లీ 58 వేల పాయింట్లు దాటింది. చివరికి.. 445 పాయింట్లు పెరిగి 58 వేల 74 పాయింట్ల వద్ద ముగిసింది.
ChatGPT: ప్రపంచ మీడియా చరిత్రలో ఇంతకుముందెన్నడూ.. ఎవరూ.. చూడని ఒక కొత్త యాంకర్ తాజాగా తెర మీదికొచ్చారు. ఆమె పేరు.. చాట్‌జీపీటీ. అదేంటి?.. చాట్‌జీపీటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే చాట్‌బాట్ కదా అనుకుంటున్నారా?. అది నిజమే. ఆ కృత్రిమ మేధతో రూపొందించిన పరికరమే ఇప్పుడు యాంకర్‌గా సరికొత్త అవతారమెత్తింది. అంతర్జాతీయ ప్రముఖులిద్దరిని అలవోకగా ఇంటర్వ్యూ చేసేసింది.
Today Business Headlines 21-03-23: భారత్‌లో అతిపెద్ద స్టోర్: ఫ్రాన్స్‌కు చెందిన పురుషుల దుస్తుల బ్రాండ్.. సిలియో.. భారతదేశంలో అతిపెద్ద స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. నగరంలోని శరత్ సిటీ మాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు వేల అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ స్టోర్ మొట్టమొదటి కాన్సెప్ట్ స్టోర్ అని కంపెనీ ఇండియా సీఈఓ సత్యన్ మోమయి చెప్పారు. సిలియోకి హైదరాబాద్‌లో ఇది ఏడో స్టోర్ కావటం విశేషం.
Startups Fundraising: సొంతగా వ్యాపారం చేయాలనే ఆలోచనలైతే దండిగా ఉన్నాయి కానీ.. అవి ఆచరణలోకి రావటానికి ఆర్థికంగా అండగా నిలిచేవారు కనిపించట్లేదు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు మరియు వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులు పెట్టేందుకు ధైర్యంగా ముందుక రాలేకపోతున్నారు. దీంతో.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. గత నెల ఫిబ్రవరిలో స్టార్టప్‌ల ఫండ్‌రైజింగ్ 8 నెలల కనిష్టానికి పడిపోయింది. ఏడాది కిందటితో పోల్చితే ఏకంగా 83 శాతం తగ్గిపోయింది.
National Retail Trade Policy: దేశవ్యాప్తంగా ఉన్న చిల్లర వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త జాతీయ విధానాన్ని రూపొందిస్తోంది. ఇప్పటికే ఉన్న పాలసీలో పలు మార్పులు చేర్పులు చేయనుంది. వ్యాపారాన్ని మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని తీసుకురానుంది. దీంతో.. వర్తకులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, మరింత క్రెడిట్ పెరగనుంది. ఆన్లైన్ రిటైలర్లకు కూడా ఇ-కామర్స్ పాలసీని అందుబాటులోకి తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉంది.
Today Stock Market Roundup 20-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించింది. మొదటి రోజైన ఇవాళ సోమవారం ఆద్యంతం నెగెటివ్ జోన్లోనే ట్రేడింగ్ జరిగింది. ఉదయం రెండు కీలక సూచీలు నష్టాలతో మొదలై సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. ఎంపిక చేసిన బ్యాంక్ స్టాక్స్‌తోపాటు ఎఫ్ఎంసీజీ రంగంలో చివరి నిమిషంలో జరిగిన కొనుగోళ్లు ఇంట్రాడేలో వచ్చిన నష్టాలను కాస్త పూడ్చగలిగాయి.
Today Business Headlines 20-03-23: 2030కి ఇ-కామర్స్: 2030 నాటికి ఇండియా ఇ-కామర్స్ ఎగుమతుల లక్ష్యాన్ని 35 వేల కోట్ల డాలర్లుగా నిర్దేశించుకోవాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్.. GTRI సూచించింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవటంలో ఎదురయ్యే ఆటంకాలను ప్రభుత్వం తొలగించాలని కోరింది. ప్రస్తుతం మన దేశం చేస్తున్న ఇ-కామర్స్ ఎగుమతుల విలువ 200 కోట్ల డాలర్ల స్థాయిలోనే ఉన్నాయి. ఇండియా మొత్తం ఎగుమతుల్లో ఈ వాటా కేవలం సున్నాపాయింట్ 5 శాతమే. GTRIని మేధావుల వర్గంగా పేర్కొంటారు.
India's First C-295 Aircraft: రక్షణ శాఖ కోసం ప్రత్యేకంగా తయారుచేయిస్తున్న అత్యాధునిక విమానం C-295. ఇటీవల విడుదలైన ఈ ఎయిర్‌క్రాఫ్ట్ వీడియోలు, ఇమేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ అధునాతన విమానాన్ని టాటా మరియు ఎయిర్‌బస్ సంస్థ కలిసి రూపొందిస్తున్నాయి. వాయుసేనకు అందించనున్న 16 మధ్య తరహా విమానాల్లో ఇది మొదటిది. మొత్తం.. 56.. C-295 విమానాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం 2021 సెప్టెంబర్‌లో ఆమోదం తెలిపింది.
Minister KTR: కేటీఆర్ లాంటి యంగ్ అండ్ డైనమిక్ మంత్రి కేరళకు కూడా కావాలని ఆ రాష్ట్రానికి చెందిన కైటెక్స్ గార్మెంట్స్ కంపెనీ ఎండీ సబూ జాకబ్ అన్నారు. తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌లోని అద్భుతమైన నాయకత్వ లక్షణాలకు అద్దం పట్టే ఒక ఉదాహరణను ఆయన ప్రస్తావించారు. ఒకానొక సందర్భంలో తాను.. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు కావాలా? (లేక) ఉపాధి కల్పన కావాలా? అని మంత్రి కేటీఆర్‌ని అడిగితే.. ఆయన వెంటనే ఎంప్లాయ్మెంట్ జనరేషనే కావాలని చెప్పినట్లు జాకబ్ గుర్తుచేసుకున్నారు.