Today Stock Market Roundup: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభ భయాలు ఇండియన్ స్టాక్ మార్కెట్‌ని ఇంకా వీడలేదు. దీంతో ఇవాళ మంగళవారం కూడా నిన్నటి మాదిరి పరిణామాలే చోటుచేసుకున్నాయి. రెండు కీలక సూచీలు ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఇంట్రాడేలో ఆ పరిస్థితి కొనసాగలేదు. ఐటీ, ఆటోమొబైల్, పవర్, రియాల్టీ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
Beer: బీరు సీసాలను మద్యంప్రియులు సరదాగా బీరకాయలు అని పిలుచుకుంటారు. బీరు.. ప్రపంచంలోనే అతిపురాతన ఆల్కహాల్ డ్రింక్. అన్ని పానీయాలతో పోల్చితే.. ఇది.. నీరు, తేనీరుల తర్వాత.. 3వ స్థానంలో నిలుస్తుంది. యంత్రాలతో కాకుండా సంప్రదాయ పద్ధతిలో తయారుచేసే బీరును క్రాఫ్ట్ బీర్ అంటుంటారు. మన దేశంలోని చెప్పుకోదగ్గ క్రాఫ్ట్ బీర్ బ్రాండ్లలో ‘Bira-91’ కూడా ఒకటి.
Today Business Headlines 14-03-23: సీఎండీగా అదనపు బాధ్యతలు: నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్.. ఎన్ఎండీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అమితవ ముఖర్జీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈయన ఇప్పుడు ఇదే సంస్థలో ఫైనాన్స్ డైరెక్టర్‌గా ఉన్నారు. 1995 బ్యాచ్ ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ ఆఫీసర్ అయిన అమితవ ముఖర్జీ.. ఎన్ఎండీసీలో చేరకముందు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌లో ఫైనాన్స్ విభాగానికి జనరల్ మేనేజర్‌గా చేశారు.
Today(13-03-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం ట్రేడింగ్‌ని శుభారంభం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇవాళ సోమవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో మొదలయ్యాయి. కానీ.. ఇంట్రాడేలో ఆ ట్రెండ్‌ని కొనసాగించలేకపోయాయి. దీంతో.. సాయంత్రం భారీ నష్టాలతో ముగిశాయి. ఈ ఏడాది కనిష్ట విలువలను నమోదు చేశాయి. వివిధ రంగాల్లోని కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తడికి గురయ్యాయి.
Driver Salary: మామూలుగా.. కార్ డ్రైవర్ నెల జీతం ఎంతుంటుంది? మహాఅయితే 20 వేల రూపాయలుంటుందేమో. ఇంకా అయితే కొంత మంది వీవీఐపీలు 50 వేల వరకు ఇస్తారేమో. కానీ.. ఏకంగా 2 లక్షల రూపాయలు సమర్పించారంటే.. అది.. చాలా విశేషమే కదా?. అయితే.. దీనికే ఆశ్చర్యపోకండి. ఇది ఐదేళ్ల కిందట ఇచ్చిన శాలరీ. మరి.. ఇప్పుడు ఇంకెంత ఉంటుందో ఊహించుకోండి. ఇంతకీ.. ఈ రేంజ్లో జీతం ఇచ్చి.. అతడి జీవితాన్ని పావనం చేసిన ఆ గొప్ప వ్యక్తి ఎవరనుకుంటున్నారా?.
Today (13-03-23) Business Headlines: దేశంలో తొలి స్టోర్ హైదరాబాద్‌లో: చిన్న పిల్లల ఆట బొమ్మల సంస్థ టాయ్స్ ఆర్ ఆజ్.. ఇండియాలో తొలి స్టోర్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఏస్ టర్టిల్ అనే ఇ-రిటైల్ కంపెనీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విక్రయ కేంద్రంలో అన్ని బ్రాండ్ల బొమ్మలూ దొరుకుతాయని కంపెనీ తెలిపింది. భారతదేశంలో బొమ్మల పరిశ్రమ టర్నోవర్ వచ్చే ఏడాది నాటికి రెండు బిలియన్ డాలర్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాయ్స్ ఆర్ ఆజ్ మరిన్ని స్టోర్లను ప్రారంభించనుంది.
India's services sector: ఈ ఏడాది ఫిబ్రవరిలో సేవల రంగం అద్భుతమైన పనితీరును కనబరిచింది. అత్యంత బలమైన స్థాయిలో విస్తరించింది. తద్వారా 12 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. అనుకూల గిరాకీ పరిస్థితులు నెలకొనటం, కొత్త వ్యాపార లాభాలు నమోదు కావటం కలిసొచ్చింది. దీంతో.. S & P గ్లోబల్ ఇండియా PMI భారీగా పెరిగింది. ఈ సూచీ విలువ జనవరిలో 57 పాయింట్ 2 వద్ద ఉండగా ఫిబ్రవరిలో 59 పాయింట్ 4కి చేరింది.
Business Headlines 11-03-23: కొత్త అధిపతి రోహిత్ జవా: హిందుస్తాన్ యూనిలీవర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రోహిత్ జవా నియమితులయ్యారు. సంజీవ్ మెహతా రిటైర్ కానుండటంతో ఆయన స్థానంలో రోహిత్ జవా రానున్నారు. ఈయన ఇప్పుడు ఇదే సంస్థలో చీఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త పదవీ బాధ్యతలను ఈ ఏడాది జూన్ 27వ తేదీన చేపట్టి ఐదేళ్లపాటు కొనసాగుతారు. రోహిత్ జవా నియామకానికి స్టాక్ హొల్డర్ల అంగీకారం పొందాల్సి ఉందని హిందుస్తాన్ యూనిలీవర్ తెలిపింది.
Today Stock Market Roundup 10-03-23: ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో వరుసగా రెండో రోజు.. అంటే.. ఇవాళ శుక్రవారం కూడా నష్టాలు కొనసాగాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో కీలక సూచీలు రోజంతా కోలుకోలేదు. ఉదయం నష్టాలతో ప్రారంభమై సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. ఫలితంగా.. సెన్సెక్స్, నిఫ్టీ.. రెండూ కూడా బెంచ్‌మార్క్ విలువలకు దిగువనే నమోదయ్యాయి.
Singapore Airlines: ఎయిరిండియా సేవలు భవిష్యత్తులో ఇండియా మొత్తం విస్తరించనున్నాయి. దేశంలోని కీలకమైన ఎయిర్‌లైన్ సెగ్మెంట్లన్నింటిలోనూ తన ఉనికిని చాటుకోనుంది. ఎయిరిండియాలోకి సింగపూర్ ఎయిర్‌లైన్స్ విలీనం అనంతరం ఇది వాస్తవ రూపం దాల్చనుంది. ఫలితంగా మల్టీ హబ్ స్ట్రాటజీ అమల్లోకి వస్తుంది. తద్వారా.. శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ అతిపెద్ద విమానయాన రంగంలో తనదైన గత వైభవాన్ని ఘనంగా చాటుకోనుంది.