Today Business Headlines 18-03-23: తెలంగాణ సహా 7 రాష్ట్రాలకి..: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు మెగా టెక్స్టైల్ పార్క్‌లను కేటాయించింది. ఈ రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాలు మూడు ఉండటం గమనించాల్సిన విషయం. ఈ పార్కులు.. ఫామ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారన్ అనే 5 ఎఫ్ విధానంతో జౌళి రంగానికి ఊతమిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
Today Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని లాభాలతో ముగించింది. ట్రేడింగ్‌కి సంబంధించి.. వీకెండ్ రోజైన ఇవాళ శుక్రవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు రావటంతో శుభారంభం లభించింది. కానీ.. ఇంట్రాడేలో ఊగిసలాటకు గురయ్యాయి. చివరికి పాజిటివ్ జోన్లోకి టర్న్ అయ్యాయి. దీంతో నిఫ్టీ మిడ్‌క్యాప్100, స్మాల్‌క్యాప్100.. సున్నా పాయింట్ 6 శాతం పెరిగాయి.
AP Budget: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిన్న గురువారం కొత్త పొద్దు పొడిచింది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి కొత్త పద్దు సమర్పించారు. 2023-24 సంవత్సరానికి 2 లక్షల 79 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. కీలక రంగాల్లో ఒకటైన సంక్షేమానికి అత్యధికంగా 51 వేల 345 కోట్ల రూపాయలు కేటాయించారు. అనంతరం.. వ్యవసాయానికి 41 వేల 436 కోట్లు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత.. విద్యకు 32 వేల 198 కోట్ల రూపాయిలు ఇచ్చారు.
Today Business Headlines 17-03-23: టీసీఎస్ సీఈఓ రాజీనామా: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేశ్ గోపీనాథన్.. పదవి నుంచి తప్పుకున్నారు. ఈ నిర్ణయం 6 నెలల తర్వాత.. అంటే.. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో కృతి వాసన్ని భవిష్యత్ సీఈఓగా నియమించారు. ఈయన ప్రస్తుతం ఇదే సంస్థలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్‌గా, గ్లోబల్ హెడ్‌గా ఉన్నారు.
Today Stock Market Roundup 16-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం తీవ్ర ఊగిసలాటకి గురైంది. ఈ వారంలో మొదటి 3 రోజులు లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిసిన సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభమై స్వల్ప లాభాలతో క్లోజ్ అయ్యాయి. ఎట్టకేలకు వరుసగా ఐదు రోజుల నుంచి వస్తున్న నష్టాలకు బ్రేక్ పడింది. ఎఫ్ఎంసీజీ మరియు బ్యాంకింగ్ సెక్టార్లలోని కొన్ని కంపెనీల షేర్లు బాగా రాణించాయి.
IPL: క్రికెట్ అభిమానులకు ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లను ఆయన ఉచితంగా ప్రసారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అత్యధిక వ్యూవర్షిప్ కలిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల డిజిటల్ ప్రసార హక్కులను ఈసారి ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని వయాకామ్18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ సంస్థ 2.7 బిలియన్ డాలర్లు చెల్లించింది.
Today Business Headlines 16-03-23: హైదరాబాద్‌కి బ్లాక్‌బెర్రీ: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. ఐఓటీ.. రంగంలో కెనడాకు చెందిన కంపెనీ బ్లాక్‌బెర్రీ ఈ ఏడాది హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ సంస్థకు కెనడా తర్వాత ఇదే అతి పెద్ద కేంద్రం కానుండటం విశేషం. ఇందులో వంద మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఉద్యోగాలు లభించనున్నాయి. సీనియర్ మేనేజ్మెంట్, టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్, క్లౌడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్, సర్వీస్ డెలివరీ తదితర జాబులు అందుబాటులోకి వస్తాయి.
Today(15-03-23) Stock Market Roundup: ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ వారం వరుసగా 3 రోజుల నుంచి ఒకే రకమైన ట్రేడింగ్ వాతావరణం నెలకొంది. ఉదయం ఉత్సాహంగా ప్రారంభం కావటం.. మధ్యాహ్నానికి డీలా పడిపోవటం.. ఇదే జరుగుతోంది. ఇవాళ బుధవారం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఎఫ్ఎంసీజీ సెక్టార్ స్టాక్స్ మరియు రిలయెన్స్, ఎయిర్టెల్ షేర్లు బలహీనపడటంతో సెన్సెక్స్, నిఫ్టీ రోజురోజుకీ నేలచూపులు చూస్తున్నాయి.
Oil giant Saudi Aramco: అంతర్జాతీయంగా పేరొందిన సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ సంస్థ.. ఆరామ్కో.. ఇంతకుముందు ఎన్నడూలేనంతగా గొప్పగా రాణించింది. గతేడాది ఏకంగా 13 పాయింట్ రెండూ సున్నా లక్షల కోట్ల రూపాయలకు పైగా లాభాలను ఆర్జించింది. తద్వారా.. తన రికార్డులను తానే తిరగరాసుకుంది. అంతేకాదు.. యాపిల్, వొడాఫోన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలతోపాటు ఎక్సాన్ మొబిల్, షెల్ తదితర అమెరికా సంస్థలు 2022లో నమోదుచేసిన ప్రాఫిట్స్‌ని అధిగమించింది.
Today Business Headlines 15-03-23: లక్షకుపైగా కంపెనీలు: రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి లక్షకు పైగానే కంపెనీలు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లక్షా 13 వేల సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది జనవరి నాటికి తెలంగాణలో 86 వేల 704 కంపెనీలు, ఏపీలో 26 వేల 437 సంస్థలు ఉన్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో 42 వేల 646 కంపెనీలు ఉండగా మూసివేసినవాటిని మరియు రద్దయ్యే క్రమంలో ఉన్న వాటిని తీసేస్తే నికరంగా 26 వేల 437…