Startups Fundraising: 8 నెలల కనిష్టానికి ఫండ్ రైజింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Startups Fundraising: సొంతగా వ్యాపారం చేయాలనే ఆలోచనలైతే దండిగా ఉన్నాయి కానీ.. అవి ఆచరణలోకి రావటానికి ఆర్థికంగా అండగా నిలిచేవారు కనిపించట్లేదు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు మరియు వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులు పెట్టేందుకు ధైర్యంగా ముందుక రాలేకపోతున్నారు. దీంతో.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. గత నెల ఫిబ్రవరిలో స్టార్టప్‌ల ఫండ్‌రైజింగ్ 8 నెలల కనిష్టానికి పడిపోయింది. ఏడాది కిందటితో పోల్చితే ఏకంగా 83 శాతం తగ్గిపోయింది.
2022 ఫిబ్రవరిలో 103 డీల్స్ కుదరగా ఆ సంఖ్య 2023 ఫిబ్రవరిలో 35కి దిగొచ్చింది. పోయినేడాది ఫిబ్రవరిలో 3 పాయింట్ 6 బిలియన్ డాలర్ల ఫండ్‌రైజింగ్ జరగ్గా ఈసారి ఫిబ్రవరిలో కనీసం ఒక బిలియన్ డాలర్ల నిధులు కూడా సమకూరలేదు. అందులో సగం.. అంటే.. 596 మిలియన్ డాలర్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు మరియు వెంచర్ క్యాపిటలిస్టులు ఎక్కువ శాతం ఫిన్‌టెక్ మరియు ఫుడ్ స్టార్టప్‌లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
Also Read
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
read more: National Retail Trade Policy: సరికొత్త జాతీయ విధానం
గత నెలలో దాదాపు 60 శాతం ఇన్వెస్ట్‌మెంట్లు ఫిన్‌టెక్ మరియు ఫుడ్ స్టార్టప్‌లకే దక్కాయి. ఈ విషయాలను ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది. అయితే.. స్టార్టప్‌లకు ఫండ్‌రైజింగ్ పడిపోవటం కొత్త కాదు. కిందటి ఏడాది 2వ అర్ధ భాగంలో కూడా ఇదే చోటుచేసుకుంది. 2022 జనవరి నుంచి జూన్ వరకు సుమారు 20 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ జరగ్గా జులై నుంచి డిసెంబర్‌కి వచ్చేసరికి 5 పాయింట్ 4 బిలియన్ డాలర్లకే పరిమితమైంది.
క్రితం సంవత్సరం మొదటి 6 నెలల్లో స్టార్టప్‌లకు నెలకి కనీసం 3 బిలియన్ డాలర్ల చొప్పున డబ్బులు పుట్టాయి. చివరి 6 నెలల్లో నెలకి 900 మిలియన్లు రావటమే గగనమైంది. ఇదిలా ఉండగా.. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఫండ్‌రైజింగ్ చేసిన సంస్థల జాబితాలో 6 ఫిన్‌టెక్ స్టార్టప్‌లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ దేఖో, ఫోన్‌పే, మింటోక్, స్టేబుల్ మనీ, లోన్‌ట్యాప్, లోన్ కుబేర్ వంటి కంపెనీలు 280 మిలియన్ డాలర్ల నిధులను సేకరించగలిగాయి.
మరో వైపు.. ఇన్వెస్ట్‌మెంట్ ట్రెండ్స్‌లో కూడా మార్పులు వచ్చాయి. గతేడాది 66 శాతం పెట్టుబడులు ఫిన్‌టెక్ సంస్థల నుంచి రుణ వ్యాపారాల వైపుకి మరలిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 63 శాతం ఇన్వెస్ట్‌మెంట్లు పేమెంట్ గేట్‌వే సొల్యూషన్లను అందించే ఫన్‌టెక్ కంపెనీలకు దక్కాయి. నిధుల సమీకరణలో రెస్టారెంట్ మరియు ఫుడ్ బిజినెస్‌లు రెండో స్థానాన్ని ఆక్రమించాయి. ఫ్రెష్ టు హోం అనే సంస్థ ఒక్కటే 104 మిలియన్ డాలర్ల ఫండ్‌రైజింగ్ చేయగలిగింది.
అమేజాన్ సంభవ్ వెంచర్ ఫండ్ ఆధ్వర్యంలో జరిగిన సిరీస్-డి ఫండ్‌రైజింగ్ రౌండ్‌లో ఫ్రెష్ టు హోమ్ ఈ నిధులను సొంతం చేసుకుంది. వీటితో 100 రిటైల్ స్టోర్లను ప్రారంభించనుంది. ఇ-కామర్స్, ఎడ్‌టెక్, ఎంటర్‌ప్రైజ్ టెక్ మరియు ఇతర కేటగిరీ స్టార్టప్‌లన్నీ కలిసి 212 మిలియన్ డాలర్ల ఫండ్‌రైజ్ చేసినట్లు మోర్గాన్ స్టాన్లీ సంస్థ తన నివేదికలో వివరించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..