India’s First C-295 Aircraft: టాటా, ఎయిర్‌బస్ కలిసి రూపొందిస్తున్న తొలి సైనిక విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s First C-295 Aircraft: రక్షణ శాఖ కోసం ప్రత్యేకంగా తయారుచేయిస్తున్న అత్యాధునిక విమానం C-295. ఇటీవల విడుదలైన ఈ ఎయిర్‌క్రాఫ్ట్ వీడియోలు, ఇమేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ అధునాతన విమానాన్ని టాటా మరియు ఎయిర్‌బస్ సంస్థ కలిసి రూపొందిస్తున్నాయి. వాయుసేనకు అందించనున్న 16 మధ్య తరహా విమానాల్లో ఇది మొదటిది.
మొత్తం.. 56.. C-295 విమానాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం 2021 సెప్టెంబర్‌లో ఆమోదం తెలిపింది. అనంతరం.. రక్షణ మంత్రిత్వ శాఖ మరియు ఎయిర్‌బస్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎప్పటినుంచో వాడుతున్న అవ్రో విమానాలకు బదులుగా ఈ కొత్త విమానాలను తెప్పిస్తున్నారు. అవి వస్తే.. మన వాయుసేన ఆధునికీకరణ దిశగా మరో ముందడుగు వేసినట్లు అవుతుంది.
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
read more: Minister KTR: తెలంగాణలో కైటెక్స్ గార్మెంట్స్ తొలి యూనిట్
ఏడాది తర్వాత ఈ రెండు కంపెనీలు C-295 విమానాల తయారీ మరియు అసెంబ్లింగ్ కోసం పరస్పరం సహకరించుకోనున్నాయి. భవిష్యత్తులో టాటా సంస్థే సొంతగా ఈ విమానాలను రూపొందించనుంది. తద్వారా.. సైనిక విమానాన్ని తయారుచేసిన తొలి భారతీయ ప్రైవేట్ సంస్థగా గుర్తింపు పొందనుంది. ఈ మేరకు ప్రధాని మోడీ 2022 అక్టోబర్‌లో గుజరాత్‌లోని వడోదరలో ఎయిర్‌క్రాఫ్ట్ మ్యానిఫ్యాక్షరింగ్ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన కూడా చేశారు.
ఈ ప్రాజెక్టు విలువ 21 వేల 935 కోట్ల రూపాయలు. ఇదిలాఉండగా ఎయిర్‌బస్ సంస్థ నుంచి మొదటి 16.. C-295 విమానాలు ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి 2025 ఆగస్టు మధ్య కాలంలో అందనున్నాయి. మొట్టమొదటి మేడిన్ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ మాత్రం 2026 సెప్టెంబర్‌లో అందుబాటులోకి రానుంది.
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!