TCS New CEO Krithivasan: ఇండియాలోని అతిపెద్ద ఐటీ కంపెనీ TCSకి కొత్త CEOగా నియమితులైన కృతివాసన్పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ పదవికి రాజీనామా చేసిన రాజేశ్ గోపీనాథన్ స్థానాన్ని ఈయన విజయవంతంగా భర్తీ చేయగలరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే.. ఈ సందేహాలకు ప్రతిఒక్కరి నుంచీ సానుకూలంగా ఫీడ్‌బ్యాక్ వస్తుండటం విశేషం. కృతివాసన్ సామర్థ్యం మరియు నాయకత్వ లక్షణాల పట్ల విశ్లేషకులు పూర్తి భరోసా ప్రకటిస్తున్నారు.
Robot Man Of India: మనకి రోబో గురించి తెలుసు గానీ రోబో మ్యాన్ ఆఫ్ ఇండియా గురించి తెలియదు. రోబో మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మన దేశంలో మొట్టమొదటి రోబోను తయారుచేసిన వ్యక్తి కాదు. ఈయన H-Bots అనే కంపెనీ ఫౌండర్-సీఈఓ. పేరు.. పీఎస్వీ కిషన్. ఆలిండియా రోబోటిక్స్ అసోసియేషన్‌కి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. H-Bots సంస్థ తొలిసారిగా ఐదేళ్ల కిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పోలీస్ రోబోను తయారుచేసింది.
Today Business Headlines 25-03-23: తెలంగాణలో తొలిసారిగా..: తెలంగాణ రాష్ట్రంలో తొలి రూరల్ మార్ట్ హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ మార్కెట్‌ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. దీని మెయింటనెన్స్‌లో భాగంగా 65 లక్షల రూపాయలతో ధాన్యం గోడౌన్, 35 లక్షల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్ కట్టారు. గ్రామీణ ప్రజల కోసం ఇందులో 500 రకాలకు పైగా నిత్యావసర సరుకులను గరిష్ట రిటైల్ ధర కన్నా 5 శాతం తక్కువే అమ్ముతున్నారు.
Today Stock Market Roundup 24-03-23: ఈ వారాంతం రోజున.. అంటే.. ఇవాళ.. శుక్రవారం.. ఇండియన్ స్టాక్ మార్కెట్ పేలవమైన ప్రదర్శన చేసింది. రెండు కీలక సూచీలు ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. సాయంత్రం కూడా భారీ నష్టాలతోనే ఎండ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడటం మైనస్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లు-2023లో చేసిన సవరణలు ఈక్విటీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి.
Satya Nadella, GMR: మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ సీఈఓ సత్యనాదెళ్ల.. క్రికెట్లోకి అడుగుపెట్టారు. అమెరికాలో కొత్తగా ప్రారంభమవుతున్న టీ20 టోర్నీలో పరోక్షంగా పాలుపంచుకుంటున్నారు. మేజర్ లీగ్ క్రికెట్‌గా పేర్కొనే ఈ టోర్నమెంట్లో పాల్గొనే ఒక టీమ్‌ని సత్యనాదెళ్ల ఫైనాన్షియల్‌గా ప్రమోట్ చేయనున్నారు. ఆ జట్టు పేరు.. సియాటల్ ఆర్కాస్. దీనికి సంబంధించిన ఫ్రాంచైజీ నిర్వహణ కోసం ఆయన పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రికెట్ లీగ్ జులైలో లాంఛ్ కాబోతోంది.
Today Business Headlines 24-03-23: నెలకోసారి.. నేను సైతం..: స్టార్‌బక్స్ సంస్థ CEOగా ఇటీవలే పగ్గాలు చేపట్టిన లక్ష్మణ్ నరసింహన్ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కంపెనీకి హెడ్ అయినప్పటికీ తాను కూడా స్టోర్లలో నెలకొకసారి హాఫ్‌డే షిఫ్ట్ పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపారు. స్టార్‌బక్స్ వర్కింగ్ కల్చర్‌ని దగ్గరగా పరిశీలించేందుకు, కస్టమర్లతో కలిసిపోయేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు నిన్న గురువారం ఒక లేఖ రాశారు. కంపెనీలోని వివిధ స్థాయిల్లో పని చేస్తున్న లీడర్షిప్ టీమ్ కూడా తన మాదిరిగానే చేస్తారని…
Today Stock Market Roundup 23-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి వరుసగా రెండు రోజుల నుంచి వస్తున్న లాభాలకు బ్రేక్ పడింది. ఇవాళ గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఇంట్రాడేలో మెరుగైన పనితీరు కనబరిచినప్పటికీ సాయంత్రం మాత్రం నష్టాలతోనే ముగిశాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పాయింట్ రెండూ ఐదు శాతం పెంచటం వల్ల ఇన్వెస్టర్లు ముందుజాగ్రత్త ప్రదర్శించారు.
AI bot as CEO: విశ్వంలో విశేషం చోటుచేసుకుంది. మానవ చరిత్రలో మహాద్భుతం జరిగింది. దేవుడు చేసిన మనిషి స్థానాన్ని.. మనిషి చేసిన రోబో భర్తీ చేసింది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఏఐ చాట్‌బాట్ ఓ కంపెనీకి బాస్ అయింది. చైనాలోని హాంకాంగ్‌కు చెందిన ఆన్లైన్ గేమ్స్ డెవలపింగ్ సంస్థ నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో రికార్డు స్థాయిలో రాణించింది.
Salary Hike Time: కొత్త సంవత్సరం వచ్చి మూడు నెలలవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం మరికొద్ది రోజుల్లో రాబోతోంది. ఈ సమయంలో ఉద్యోగులు తమ వేతనాలు ఏ మేరకు పెరుగుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏప్రిల్ నుంచి కొత్త బడ్జెట్ అమల్లోకి రానుండటంతో కొన్ని ధరలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు శాలరీ హైక్ ఆశిస్తారు. పర్సనల్ ఫైనాన్సియల్ ప్లానింగ్ వేసుకుంటారు.
Airtel Vs Jio: జియో, ఎయిర్టెల్ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ 2 సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. 5జీ యూజర్ల కోసం అన్లిమిటెడ్ డేటాను అందిస్తున్నాయి. జియో ఇప్పటికే ఈ సర్వీసును ప్రారంభించింది. తాజాగా.. ఎయిర్టెల్ సైతం ఇదే ప్రకటన చేసింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లు మరియు 239 రూపాయలు అంతకన్నా ఎక్కువ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే ప్రీపెయిడ్ కస్టమర్లు ఇకపై అపరిమితంగా డేటా వాడుకోవచ్చని తెలిపింది.