టీజీఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ రిలీజ్ చేసింది. మూడు విడతల్లో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొదటి విడత కౌన్సిలింగ్ కి జూన్ 28 నుంచి జులై 7వ తేదీ వరకు స్లాట్ బుక్ కింగ్ కి అవకాశం ఇచ్చారు. కాగా ఈ ఏడాది ఎప్ సెట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ విధానం లో మార్పులు తీసుకొచ్చారు. ఒరిజినల్ సీట్స్ అలాట్మెంట్ కన్నా ముందు మాక్ సీట్ అలాట్మెంట్ (అవగాహనా కోసమే మాక్ సీట్స్ ఎలాట్మెంట్) చేయనున్నారు. వెబ్ కౌన్సిలింగ్ మీద అవగాహనా లేని విద్యార్థుల కోసం ఈ సంవత్సరం ఉన్నత విద్య మండలి మాక్ సీట్ అలాట్మెంట్ అనే విధానం ప్రవేశ పెట్టింది.
Also Read:PM Modi: జూలై 2 నుంచి 9 వరకు ప్రధాని మోడీ 5 దేశాల పర్యటన..
దీని వల్ల మాక్ సీట్ అలాట్మెంట్ జరిగిన తరవాత ఏమైన తప్పిదాలు జరిగిన, వచ్చిన సీట్ నచ్చక పోయిన మళ్ళి ఆప్షన్స్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల వచ్చిన ర్యాంక్, రిజర్వేషన్ ఆధారంగా మంచి కాలేజీ లో వచ్చే అవకాశం ఉంది. మాక్ సీట్ అలాట్మెంట్ తర్వాత వచ్చిన కాలేజీ మీరు ఓకే అనుకున్నా మీరు ఇచ్చిన ఆప్షన్స్ లో ఏమి మార్పులు లేకుంటే అవే ఆప్షన్స్ ని పరిగణనలోకి తీసుకుంటారు . కాలేజీ నచ్చకుంటే ఏమైన మార్పులు చేయాలి అనుకుంటే మాక్ సీట్ అలాట్మెంట్ తర్వాత రెండు రోజుల సమయం ఉంటుంది.
Also Read:Kubera vs Kannappa : కుబేరపై కన్నప్ప ఎఫెక్ట్ పడుతుందా..?
ఈ సంవత్సరం రెండవ ఫేస్ కౌన్సిలింగ్ తర్వాత వచ్చిన కాలేజీలో తప్పకుండా వెళ్లి రిపోర్ట్ చేస్తేనే ఫైనల్ ఫేస్ కౌన్సిలింగ్ కి, ఇంటర్నల్ స్లయిడింగ్ కి అవకాశం ఉంటుంది. రెండవ ఫేస్ కౌన్సిలింగ్ లో వచ్చిన కాలేజీలో రిపోర్ట్ చేయకుంటే ఫైనల్ ఫేస్ కౌన్సిలింగ్ కి వెళ్ళడానికి లేదు. చివరి దశ తర్వాత అంటే ఫైనల్ ఫేస్ తర్వాత డ్రాపౌట్‌లు/రద్దులు అనుమతించబడవు. ఫైనల్ ఫేస్ తర్వాత మిగిలిపోయిన సీట్లకు ఇంటర్నల్ స్లయిడింగ్ ప్రక్రియ ద్వారా కన్వినర్ ఏ సీట్లను భర్తీ చేస్తారు.
Also Read:Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు.. ట్విస్ట్ ఏంటంటే..?
ఇంటర్నల్ స్లయిడింగ్ ద్వారా బ్రాంచ్ మార్చుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుంది. ఇంటర్నల్ స్లయిడింగ్ తర్వాత డ్రాపౌట్‌లు/రద్దులు ఏమైన ఉంటే స్పాట్ అడ్మిషన్స్ లో భర్తీ చేయడానికి ఉండదు. లాటరల్ ఎంట్రీ ద్వారా రెండవ సంవత్సరంలో జాయిన్ అయ్యే ECET విద్యార్థులకు ఇవ్వొచ్చు. ఇంటర్నల్ స్లయిడింగ్ తర్వాత ఏమైన సీట్లు వుంటే ( ఫిల్ కానీ , స్లయిడింగ్ ద్వారా ఖాళీ అయిన ) సీట్లను స్పాట్ అడ్మిషన్స్ ద్వారా భర్తీ చేసుకోవచ్చు.