ChatGPT: మార్కెట్‌లోకి కొత్త యాంకర్. ఈమెనెప్పుడైనా చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ChatGPT: ప్రపంచ మీడియా చరిత్రలో ఇంతకుముందెన్నడూ.. ఎవరూ.. చూడని ఒక కొత్త యాంకర్ తాజాగా తెర మీదికొచ్చారు. ఆమె పేరు.. చాట్‌జీపీటీ. అదేంటి?.. చాట్‌జీపీటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే చాట్‌బాట్ కదా అనుకుంటున్నారా?. అది నిజమే. ఆ కృత్రిమ మేధతో రూపొందించిన పరికరమే ఇప్పుడు యాంకర్‌గా సరికొత్త అవతారమెత్తింది.
అంతర్జాతీయ ప్రముఖులిద్దరిని అలవోకగా ఇంటర్వ్యూ చేసేసింది. అందులో ఒకరు.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కాగా ఇంకొకరు మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్. ఈ ఇద్దరిని చాట్‌జీపీటీ.. ఆసక్తికరమైన.. కాస్త కష్టమైన ప్రశ్నలే అడిగింది. వాటికి.. వాళ్లు కూడా.. అంతే ఆకట్టుకునేలా సమాధానాలు చెప్పారు. ఈ విషయాన్ని బిల్‌గేట్స్.. లింక్డిన్ ద్వారా వెల్లడించారు.
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
read more: Startups Fundraising: 8 నెలల కనిష్టానికి ఫండ్ రైజింగ్
గ్లోబల్ ఎకానమీ పైన, జాబ్ మార్కెట్ మీద టెక్నాలజీ ప్రభావం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బిల్‌గేట్స్ బదులిస్తూ.. హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ సెక్టార్లలో నిపుణుల కొరతను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తీరుస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. యవ్వనంలోకి వెళ్లగలిగితే మీ కెరీర్ కోసం మీకు మీరు ఎలాంటి సలహాలు ఇచ్చుకుంటారన్న ప్రశ్నకు బిల్‌గేట్స్ సరదాగా జవాబిచ్చారు.
భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించకుండా వర్తమానంలో బతికేందుకు ప్రయత్నిస్తానన్నారు. యవ్వనంలో బాగా కష్టపడ్డానని, ఇప్పుడు ఆలోచిస్తుంటే అంతలా శ్రమించి ఉండకూడదనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. రిషి సునాక్ కూడా ఇదే ఒపీనియన్‌ని వ్యక్తం చేశారు. మీకు సంబంధించిన ఏ పనులను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చేస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారన్న ప్రశ్నకు ఇద్దరూ వేర్వేరు ఆన్సర్లు ఇచ్చారు.
తన నోట్స్‌ని కృత్రిమ మేధ అయితే తనకన్నా తెలివిగా రాయగలదని బిల్‌గేట్స్ అన్నారు. ప్రతివారం ప్రధానమంత్రి ఎదుర్కొనే ప్రశ్నల సమయాన్ని తనకు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చూసుకుంటే బాగుంటుందని రిషి సునాక్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!