Swetcha’s father: ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యపై ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు ఇలా చేసుకోవడానికి పూర్ణ చందర్ అనే వ్యక్తి కారణమని ఆరోపించారు. గత 3 సంవత్సరాల నుంచి నా కూతురు వెంట పూర్ణచంద్రరావు పడ్డాడు.. పూర్ణచందర్ వేధింపుల వల్లనే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది.. నా కూతురుని పెళ్లి చేసుకుంటానని మూడేళ్లుగా పూర్ణచందర్ వెంటపడి వేధించాడు.. నా కూతురు పెళ్లికి అంగీకరించిన తర్వాత ఇద్దరి మధ్య చాలా సార్లు ఎన్నో గొడవలు జరిగాయని పేర్కొన్నాడు.
Read Also: Top Headlines @1PM: టాప్ న్యూస్!
అయితే, పూర్ణచందర్ తో గొడవలు తారాస్థాయికి చేరడంతో ఇటీవల నా కూతురు అతడితో ఉండను అని తేల్చి చెప్పింది అని ఆమె తండ్రి శంకర్ వెల్లడించారు. ఇక, జూన్ 26వ తేదీన ఇద్దరికీ గొడవ జరిగితే నన్ను ఇంటికి రమ్మని పిలిచింది.. ఆ రోజు నేను స్వేచ్ఛతో మాట్లాడాను.. పూర్ణచందర్ తో సంబంధం కొనసాగించలేను అని కరాకండిగా చెప్పింది.. పూర్ణచందర్ వేధింపుల వల్ల నా కూతురు తీవ్ర మానసిక వేదనకు గురైంది.. ఆ డిప్రెషన్ తోనే నిన్న (జూన్ 27న) స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది అని తండ్రి శంకర్ చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అలాగే, పూర్ణచందర్ వల్లనే మా అమ్మ చనిపోయింది అని స్వేచ్ఛ కుతూరు ఆరోపించింది. వాణ్ని నమ్మి మోసపోయింది అమ్మా.. వాడు మంచివాడు కాదని నాకు అనిపించింది.. వద్దమ్మా అని చెప్పినా విన్లేదు మా అమ్మ వినలేదు అని యాంకర్ స్వేచ్ఛ కూతురు ఎమోషనల్ అయింది.