Today Stock Market Roundup 23-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి వరుసగా రెండు రోజుల నుంచి వస్తున్న లాభాలకు బ్రేక్ పడింది. ఇవాళ గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఇంట్రాడేలో మెరుగైన పనితీరు కనబరిచినప్పటికీ సాయంత్రం మాత్రం నష్టాలతోనే ముగిశాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పాయింట్ రెండూ ఐదు శాతం పెంచటం వల్ల ఇన్వెస్టర్లు ముందుజాగ్రత్త ప్రదర్శించారు.
read more: AI bot as CEO: మానవ చరిత్రలోనూ మొదటిసారి కావటం విశేషం
ఈ క్యాలెండర్ ఇయర్‌లో మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే వార్తలు రావటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ని దెబ్బతీశాయి. దీంతో.. సెన్సెక్స్ చివరికి 289 పాయింట్లు కోల్పోయి 57 వేల 925 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. నిఫ్టీ.. 75 పాయింట్లు తగ్గి 17 వేల 76 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 13 కంపెనీలు లాభాల బాటలో నడవగా మిగతా 17 కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.
బీఎస్‌ఈలో నెస్లే ఇండియా, మారుతీ, ఎయిల్‌టెల్, టాటా మోటార్స్ రాణించాయి. బజాజా ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహింద్రా, ఎల్ అండ్ టీ వెనకబడ్డాయి.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో హిండాల్కో, మారుతీ, నెస్లే సంస్థల స్టాక్స్ విలువ ఒక శాతం పెరిగింది. ఎస్‌బీఐ, బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీల షేర్ల వ్యాల్యూ ఒకటిన్నర శాతానికి పైగా తగ్గింది.
వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. తేగా ఇండస్ట్రీస్ షేర్లు 8 శాతం ర్యాలీ తీశాయి. తద్వారా 52 వారాల గరిష్టానికి చేరాయి. మరోవైపు.. ఇన్ఫోసిస్ షేర్ విలువ దాదాపు ఏడాది కనిష్టానికి పడిపోయింది. ఒక్క నెలలోనే 12 శాతం పతనమైంది. 10 గ్రాముల బంగారం రేటు 535 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 59 వేల 291 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 395 రూపాయలు పెరిగి గరిష్టంగా 69 వేల 704 రూపాయలు పలికింది.
క్రూడాయిల్ రేటు అతిస్వల్పంగా 44 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 5 వేల 795 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 39 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 27 పైసల వద్ద స్థిరపడింది.