Satya Nadella, GMR: సత్య నాదెళ్ల కొత్త ఇన్నింగ్స్. జీఎంఆర్‌తోపాటు మరింత మంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satya Nadella, GMR: మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ సీఈఓ సత్యనాదెళ్ల.. క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. అమెరికాలో కొత్తగా ప్రారంభమవుతున్న టీ20 టోర్నీలో పరోక్షంగా పాలుపంచుకుంటున్నారు. మేజర్ లీగ్ క్రికెట్‌గా పేర్కొనే ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ఒక టీమ్‌ని సత్యనాదెళ్ల ఫైనాన్షియల్‌గా ప్రమోట్ చేయనున్నారు. ఆ జట్టు పేరు.. సియాటల్ ఆర్కాస్.
దీనికి సంబంధించిన ఫ్రాంచైజీ నిర్వహణ కోసం ఆయన పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రికెట్ లీగ్ జులైలో లాంఛ్ కాబోతోంది. సియాటల్ గ్రూప్‌లో సత్యనాదెళ్లతోపాటు ఢిల్లీ క్యాపిటల్స్ మరియు జీఎంఆర్ గ్రూప్ సహా పలువురు ప్రముఖులు కూడా పార్ట్నర్‌లు అవుతున్నారు. ఈ మేరకు.. మేజర్ క్రికెట్ లీగ్ ఒక ప్రకటన చేసింది. ఆర్కాస్ అనేది సియాటల్ ఏరియాలోని సముద్రంలో సంచరించే ప్రమాదకరమైన తిమింగళం పేరు.
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
Salary Hike Time: వేతనాలు పెరిగే వేళాయెరా. అయితే.. ఈ టైంలో సంస్థలు ఏం ఆలోచిస్తాయంటే?
ప్రాణాంతకమైన ఈ జీవిని.. శక్తికి మరియు బలానికి చిహ్నంగా భావిస్తారు. సియాటల్ ఆర్కాస్ జట్టులో సత్యనాదెళ్లతోపాటు సోమ సోమసేగర్, సమీర్ బోడాస్, అశోక్ కృష్ణమూర్తి, సంజయ్ పార్థసారధి వంటివాళ్లు సైతం ఇన్వెస్ట్ చేస్తున్నారు. మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ జులై 13వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెక్సాస్‌లోని డల్లాస్‌లో జరుగుతుంది.
ఒక్కో టీమ్‌లో కనీసం 15 మంది, గరిష్టంగా 18 మంది ప్లేయర్లు ఉంటారు. ఇందులో 9 మంది విదేశీ ఆటగాళ్లు కాగా మ్యాచ్‌లో పాల్గొనే 11 మందిలో మినిమం ఆరుగురు లోకల్ ఆటగాళ్లు ఉంటారు. ఇదిలాఉండగా.. ఇండియన్ క్రికెట్‌లో మెగా సక్సెస్ అయిన ఐపీఎల్ ప్రయోగం ఇప్పుడు అమెరికాకి కూడా పాకిందని దీన్నిబట్టి చెప్పొచ్చని పరిశీలకులు అంటున్నారు.
తాజావార్తలు
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!