Robot Man Of India: మనకి రోబో గురించి తెలుసు గానీ రోబో మ్యాన్ ఆఫ్ ఇండియా గురించి తెలియదు. రోబో మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మన దేశంలో మొట్టమొదటి రోబోను తయారుచేసిన వ్యక్తి కాదు. ఈయన H-Bots అనే కంపెనీ ఫౌండర్-సీఈఓ. పేరు.. పీఎస్‌వీ కిషన్. ఆలిండియా రోబోటిక్స్ అసోసియేషన్‌కి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. H-Bots సంస్థ తొలిసారిగా ఐదేళ్ల కిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పోలీస్ రోబోను తయారుచేసింది.
read more: Satya Nadella, GMR: సత్య నాదెళ్ల కొత్త ఇన్నింగ్స్. జీఎంఆర్‌తోపాటు మరింత మంది
దీంతో.. రొమేనియాలో ఆ దేశ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన డెమో కోసం ఆహ్వానించారు. అప్పుడు అనుకోని సంఘటన జరిగింది. రోబోని స్టేజ్ మీదికి తీసుకెళ్లే క్రమంలో దాని తలకాయ ఊడిపోయింది. అయితే.. అది మొదటి కాన్ఫరెన్స్ కాబట్టి ఎలాగోలా మేనేజ్ చేశారు. కానీ.. రెండో కాన్ఫరెన్స్‌కి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. రోబో బాడీ మొత్తం పనిచేస్తోంది గానీ హెడ్ మాత్రమే పనిచేయట్లేదని కిషన్‌కి తెలుసు.
ఈ లోపాన్ని కవర్ చేయటం కోసం.. ముందుగా.. రోబో అసెంబ్లింగ్ గురించి కాకుండా డిసెంబ్లింగ్ గురించి వివరించారు. మేమొక రోబోను తయారుచేశామని, దాన్ని పది సెకన్ల లోపే డిసెంబ్లింగ్ చేయటం ఎలాగో వివరిస్తానంటూ చెప్పి.. కిషన్.. మొత్తానికి రెండో కాన్ఫరెన్స్‌ని కూడా సక్సెస్‌ఫుల్‌గా క్లోజ్ చేశారు. తద్వారా తనదైన సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. కానీ.. అసలు విషయాన్ని ఆ తర్వాత అందరికీ వివరించారు.
ఇదంతా గమనిస్తున్న రొమేనియాలోని ఒక ఇండియన్.. కిషన్‌ని.. అభిమానంతో.. రోబో మ్యాన్ ఆఫ్ ఇండియా అని మెచ్చుకున్నారు. అలా.. ఈయనకు మొదటిసారిగా ఈ వెరైటీ పేరొచ్చింది. అప్పటినుంచీ అలాగే కొనసాగుతోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే.. పీఎస్‌వీ కిషన్‌తో ఎన్-బిజినెస్ నిర్వహించిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూని వీక్షించవచ్చు.