Karnataka: 5 పులుల మృతి కేసులో ముగ్గురు అరెస్ట్.. ఎందుకు చంపారంటే..!
- కర్ణాటకలో 5 పులుల మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
- విచారణలో విస్తుగొల్పే విషయాలు వెల్లడించిన నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో ఒకేసారి ఐదు పులులు మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. పోస్ట్‌మార్టం రిపోర్టులో విషాహారం తిని చనిపోయినట్లుగా తేలింది. దీంతో ఎవరో కావాలనే ఈ పని చేసి ఉంటారని ఫారెస్ట్ అధికారులు భావించారు. అంతేకాకుండా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కూడా సీరియస్‌గా తీసుకున్నారు. అవి సహజ మరణాలు కావని.. ఎవరో చంపారని పేర్కొన్నారు. దర్యాప్తు చేసి మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు.. సమీప గ్రామస్తులను విచారించగా ఈ ఘాతుకానికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Swetcha’s father: నా కూతురు చావుకు అతడే కారణం.. స్వేచ్ఛ తండ్రి సంచలన ఆరోపణలు..
Also Read
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
కర్ణాటకకు చెందిన మాదురాజు అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. తమ ఆవును పులి వేటాడి చంపినందుకు ప్రతీకారంగా పులులకు విషం పెట్టినట్లు నిందితుడు అధికారుల ముందు ఒప్పుకున్నాడు. స్నేహితులు కోనప్ప, నాగరాజుల సాయంతో ఈ పని చేసినట్లుగా అంగీకరించాడు. చనిపోయిన తన ఆవు కళేబరంపై విషం చల్లి.. దానిని అడవికి సమీపంలో పడేసినట్లు తెలిపారు. ఆ విష కళేబరాన్ని తిన్న తల్లి పులి, దాని నాలుగు పిల్లలు ప్రాణాలు కోల్పోయాయని చెప్పాడు. ఇక తదుపరి విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Naga chaitanya: శోభితతో జీవితం సంతోషంగా సాగుతుంది..
ఇదిలా ఉంటే విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనపై పూర్తి నివేదిక అందిన తర్వాత నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రేకు సూచించారు.
మలేమహదేశ్వర హిల్స్‌లోని హూగ్యం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒకేసారి ఐదు పులులు చనిపోవడం కర్ణాటక చరిత్రలోనే తొలిసారి. దీంతో ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మొత్తానికి నిందితులను అరెస్ట్ చేశారు. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో 563 పులులు ఉన్నాయి. మధ్యప్రదేశ్ తర్వాత అంత ఎక్కువగా ఉన్నది కర్ణాటకలోనే. ఈ పులుల సంరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా… సమీప గ్రామస్తులు విషప్రయోగంతో చంపేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.
తాజావార్తలు
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?