మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం కన్నప్ప. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాలో మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి ఏర్పడింది. ఆసక్తిని పెంచుతూ ఒక్కొక్క నటుడిని తీసుకురావడంతో సినిమా మీద అంచనాలు పెరుగుతూ వెళ్లాయి.
Also Read:Naga chaitanya: శోభితతో జీవితం సంతోషంగా సాగుతుంది..
అయితే సినిమా ప్రమోషనల్ కంటెంట్ మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. నిజానికి ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు సినిమా మీద ఎవరికీ నమ్మకం లేదు. ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నమ్మకాలు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమాకి సంబంధించి టాక్ మారిపోయింది. మంచు విష్ణు నటన గురించి, ప్రభాస్ ఎపిసోడ్ గురించి ప్రేక్షకులందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి.
Also Read:Pawankalyan : ‘హరిహర వీరమల్లు’ మేకర్స్ ప్లానింగ్‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్.. !
ఏరియా వారీగా ఎంత కలెక్ట్ అయిందనే విషయాల మీద ఇంకా డేటా బయటకు రాలేదు, కానీ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. సుమారు 200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు అంచనాలు ఉన్నాయి. అయితే అధికారికంగా మాత్రం ఎవరూ ఇంకా కలెక్షన్స్ వివరాలు కానీ, బడ్జెట్ వివరాలు కానీ వెల్లడించలేదు.