భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ వేగంగా పెరుగుతోంది. కొత్తగా ద్విచక్ర వాహనాలను కొనే వాళ్లు ఎలక్ట్రిక్ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల అల్ట్రావైలెట్ హై-ఎండ్ సూపర్ బైక్ విభాగంలో తన మొదటి ఉత్పత్తి షాక్ వేవ్ ని విడుదల చేసింది. దీని ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్), కానీ మొదటి 10,000 మంది కస్టమర్లకు కేవలం రూ. 1.20 లక్షలకే లభిస్తుంది. ఈ స్కూటర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. దీని ఫీచర్లు తెలుకున్న నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు.
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారతదేశంలో తన ప్రసిద్ధ పికప్ హిలక్స్ యొక్క కొత్త బ్లాక్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది. భారతదేశంలోని అన్ని టయోటా డీలర్‌షిప్‌లలో హిలక్స్ బ్లాక్ ఎడిషన్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. దీని డెలివరీ మార్చి, 2025లో ప్రారంభమవుతుంది. భారత మార్కెట్లో హిలక్స్ బ్లాక్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 37.90 లక్షలుగా ఉంచారు. నల్ల పులిలాగా కనిపించే ఈ కారు లుక్ అదిరిపోయింది. ఈ హిలక్స్ డిజైన్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..
మారుతి సుజుకి ఇండియా మార్చిలో తన అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోపై గొప్ప డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ కారుపై కంపెనీ రూ.50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. కంపెనీ వినియోగదారులకు నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఐదవ కారు కూడా ఇదే. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.70 లక్షల నుంచి మొదలవుతుంది.
పుష్ప -2 విజయంతో బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అల్లు అర్జున్ ప్రస్తుతం.. పాన్-ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఐకాన్ స్టార్‌కి అభిమానులు కూడా అదే రేంజ్లో ఉన్నారు. అల్లు అర్జున్-స్నేహ రెడ్డి నేడు 14వ పెళ్లిరోజును తమ నివాసంలో నిర్వహించుకున్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకు కేకు కట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 6 గంటలుగా కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. క్యాబినెట్ లో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశ తేదీల ఖరారు అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి అగ్నిప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. తాజాగా బహుదూర్ పురాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బహదూర్‌పుర x రోడ్డులోని లారీ మెకానికల్ వర్క్ షాపులో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఈ మెకానికల్ వర్క్ షాపులో ఒక అగ్ని ప్రమాదం జరుగుతున్న…
నిర్మల్ లో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇవి వదంతులు మాత్రమే అని, అసత్య వార్తలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కడెం జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ పలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నవి అసత్యపు వార్తలని స్పష్టం చేశారు. అవాస్తవ సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని, కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండవ సెమీఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను 50 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో కివీస్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 362 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా, దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 312 పరుగులు మాత్రమే చేయగలిగింది.
గెలుపునకు మేమందరం బాధ్యత తీసుకున్నాం.. ఓటమి కూడా సమిష్టి బాధ్యత అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీ అభ్యర్థులకు సపోర్ట్ చేసిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా చూపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సభ్యుల ఓటమిపై ఎంపీ మల్లు రవి ఢిల్లీలో మాట్లాడారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి అఖండ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "ఈ విజయం తెలంగాణ సమాజానికి, ఉపాధ్యాయులకు అంకితం ఇస్తున్నాం. రెండు ఎమ్మెల్సీలు ఏక కాలంలో రావడం చాలా సంతోషం. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని ఆదరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్దీ నెలల్లోనే కాంగ్రెస్ తో సమానంగా…