నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలోనే ఉమ్మడి ఏపీలో తెలంగాణ బిల్లు పాస్ అయిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆ క్రెడిట్ అప్పటి స్పీకర్‌గా నాదెండ్లకు ఇవ్వాలన్నారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇరు రాష్ట్రాల విధానాలు, బెటర్ టెక్నాలజీ గురించి చర్చించినట్లు తెలిపారు. కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్ పోర్ట్ చేస్తున్నామని.. ఇల్లీగల్ రైస్ కట్టడి గురించి మాట్లాడినట్లు చెప్పారు. అసెట్స్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజనలో సివిల్ సప్లై సగం బిల్డింగ్ ఏపీకి వెళ్ళిందని.. రెసిడెంట్స్ ప్లాట్ 16 పంజాగుట్టలో ఉన్నాయి. తెలంగాణకే రాబోతున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ సివిల్ సప్లై ఆఫీస్ బిల్డింగ్ ఇరుగ్గా ఉందని.. బయట మీటింగ్ లు పెట్టాల్సి వస్తోందన్నారు. ఫుడ్ రిలేటెడ్ డిపార్ట్ మెంట్ లు ఇక్కడే ఉండాలని ఈ ఏపీ బిల్డింగ్ అడిగినట్లు తెలిపారు. జూన్ 1 నుంచి పూర్తి బిల్డింగ్ మనకు అప్పగిస్తున్నారని స్పష్టం చేశారు. సివిల్ సప్లై ఆస్తులపై చర్చలు జరిగాయని.. కార్పొరేషన్ కు ఉన్న ఆస్తుల బదిలీ మీద మాట్లాడుతున్నట్లు వెల్లడించారు.
READ MORE: AP DSC 2025: సుప్రీంకోర్టులో లైన్ క్లియర్.. షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ..
అనంతరం ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. “ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని… ఎవ్వరూ సమస్యలు ఎదుర్కోవద్దని.. ప్రజలకు మేలు చెయ్యాలని మా ఉద్దేశం. వీలైనంత త్వరగా మంచి వాతావరణంలో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం. 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఏపీ సివిల్ సప్లై భవన్ ను పూర్తిగా తెలంగాణకు అప్పగిస్తున్నాం. తెలంగాణలో అమల్లో ఉన్న టెక్నాలజి మార్పులను మేము అందుకుంటాం. తెలంగాణలో కొన్ని అద్భుతమైన సంస్కరణలు చేశారు. కాకినాడ నుంచి పిలిప్పిన్ కు బియ్యం ఎగుమతి చేస్తున్నాం.. దానికి అవసరమైన అన్ని సౌకర్యాల మీద చర్చించాం. ఆస్తుల బదిలీ జరగాల్సిన అవసరం ఉంది. రైతాంగానికి మేలు జరిగేలా ఆహార భద్రతలో లోపాలు లేకుండా చెయ్యాలని ఉద్దేశ్యం. జూన్ 12 నుంచి పాఠశాలల్లో సన్న బియ్యం అందించనున్నాం. ఎక్స్ పోర్ట్ మీద కూడా చర్చించాం… వినియోగదారులకు మేలు రకమైన బియ్యం అందుబాటు ధరలో ఉండాలనేది మా ఉద్దేశ్యం.” అని ఏపీ మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: Dubbak Murder Case : 80 రోజుల పసికందును హత్య చేసిన తల్లి.. విచారణలో షాకింగ్ విషయాలు..!