భారతదేశంలో కోవిడ్-19 మళ్ళీ కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు, చాలా కాలం తర్వాత మళ్ళీ కరోనాతో విదేశాల్లో మరణాలు సంభవించడం తీవ్ర సంచలనం రేపుతోంది. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదల ప్రజలను అప్రమత్తం కావాలని హెచ్చరిస్తోంది. ఈ కేసులు తెలుగు రాష్ట్రాల్లో సైతం నమోదవుతున్నాయి. ఇప్పటికే విశాఖలో కరోనా కేసు నమోదు కాగా నేడు కడపలో నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది.
READ MORE: Off The Record: ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కాపు తమ్ముళ్లు కుదురుగా ఉండలేకపోతున్నారా..?
తాజాగా ఈ కరోనా తెలంగాణకు సైతం చేరుకుంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. రోగుల కోసం ముందు జాగ్రత్తగా సెల్ఫ్ టెస్ట్ చేసుకున్నారు. దీంతో కరోనా పాజిటివ్ వచ్చింది. భయపడాల్సిన పని లేదని.. రెండు రోజులు లైట్ ఫీవర్ వచ్చిందని డాక్టర్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
READ MORE: Kavitha: కేసీఆర్ కూతురైన నా లేఖనే బయటికి వచ్చిందటే… పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి?