బీజేపీ అధికారంలోకి వస్తే మేడిగడ్డపై సీబీఐ విచారణ చేయిస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీటలు వారుతున్న పరిస్థితిలో కాంగ్రెస్ కు తెలివి వచ్చిందని.. సీబీఐ విచారణకు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడుగా తాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ మునిగి పోతున్న నావ అని ఎద్దేవా చేశారు. డాటార్ డాడీల మధ్య ఉత్తరాలు ఇంకా జరుగుతాయని విమర్శించారు.. కుటుంబ పార్టీలు ప్రజల కొంపలు ముంచుతాయన్నారు. ఆ ఉత్తరం ఓ డ్రామా.. డాడీ డాటర్‌ల మధ్య మాటలు లేవని ఇప్పుడే తెలిసిందన్నారు. ఆ పార్టీ గురుంచి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆ పార్టీ కి భవిష్యత్తు లేదని విమర్శించారు…
తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం అని ప్రజలు అనుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు… రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ కోసం తాను పని చేయడం లేదని.. తాను దుప్పటి కప్పుకుని పడుకుంటానని… రేవంత్ రెడ్డి ఏమీ కప్పుకుని పడుకుంటారు… నాకైతే తెలియదని వ్యాఖ్యానించారు. నక్సలైట్ ఎన్‌కౌంటర్లపై కిషన్ రెడ్డి మాట్లాడారు.” టెర్రరిస్టు కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వ్యక్తిని నేను. నక్సలైట్లతో చాలా సార్లు చర్చలు జరిగాయి. చాలా మంది బయటకు వచ్చారు.. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు అయ్యారు. హింసకు తావులేదు. జనజీవన స్రవంతి లోకి రావాలని మేము కోరుతున్నాం. తుపాకిల ద్వారా హింస ద్వారా ఏమీ సాధించలేరు..” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Beerla Ilaiah : బీఆర్ఎస్ మునిగిపోయే నావ.. అందులో నుంచి దూకాలని కవిత చూస్తోంది..
రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు… “ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వం దృష్టి సారించి పూర్తిగా చేయాలని కోరుతున్న. 53 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు కేంద్రం రాష్ట్రంతో ఒప్పందం. ఇంకా అదనంగా తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.. ధాన్యం సేకరణ లో రాష్ట్ర ప్రభుత్వం పై నయా పైసా భారం పడదు. అదనపు సెంటర్ లు అయినా ఓపెన్ చేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలి..
స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయనే నమ్మకం నాకు లేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన బీజేపీ సిద్ధమే.” అని కేంద్ర మంత్రి తెలిపారు. ఢిల్లీకి రేవంత్ కప్పం కడుతున్నారని పునరుద్ఘాటించారు.