తండ్రికి కూతురు రాసిన లేఖ బయటకి ఎలా వచ్చింది? అది కూడా రాసిన 20 రోజుల తర్వాత బయట పెట్టడం వెనక వ్యూహం ఏంటి? కేసీఆర్ విషయంలో కవిత కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం.. ఆయనకు ఇబ్బందికరమైన అంశాలు ప్రస్తావించడాన్ని ఎలా చూడాలి? అసలు లేఖను బయటపెట్టిన లీకు వీరులు ఎవరు?
READ MORE: Pakistan: భారత్ ‘‘నీటి బాంబు’’తో ఆకలి చావులు తప్పవు.. పాకిస్తాన్ సెనెటర్ ఆందోళన..
తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు ఆ లేఖ చుట్టే తిరుగుతోంది. తన తండ్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కి ఎమ్మెల్యే కవిత రాసిన లెటర్ ఇటు పార్టీలో అటు బయట కూడా పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది. ఒక పార్టీ నేత మరో పార్టీ నేతకు లేఖ రాయడం కామన్. ఒకే పార్టీలో ఉండి రాస్తే దాన్ని ధిక్కారంగా భావిస్తారు. ఇలాంటి వాతావరణంలో తండ్రి కూతుళ్ల బంధాన్ని పక్కన పెడితే.. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధ్యక్షుడికి రాసిన లేఖ ఉన్నట్టుండి పొలిటికల్ హీట్‌ను పెంచింది. ఇందులో చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారు కవిత. పాజిటివ్, నెగిటివ్ విషయాలు అంటూ సుదీర్ఘ ప్రస్తావన చేశారు.
READ MORE: Pakistan: భారత్ ‘‘నీటి బాంబు’’తో ఆకలి చావులు తప్పవు.. పాకిస్తాన్ సెనెటర్ ఆందోళన..
పాజిటివ్ అంశాలపై బీఆర్ఎస్‌లో ఎవరికి అభ్యంతరం లేఖ పోయినా.. నెగెటివ్ మీదే ఇప్పుడు అన్ని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పార్టీ రజతోత్సవ బహిరంగ సభ వేదిక మీద జరిగిన అంశాలను కూడా ప్రస్తావించారు కవిత. అలాగే కేసీఆర్ ఎవ్వరికీ యాక్సిస్ ఇవ్వడం లేదని ఆరోపించారు. అదంతా ఒక ఎత్తు. ఇది పార్టీ అంతర్గత విషయం. కానీ పార్టీ అధ్యక్షుడికి స్వయంగా ఎమ్మెల్సీ రాసిన లేఖ బయటికి ఎలా వచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇంత ఘాటుగా రాసిన లేఖను అది 20 రోజుల తర్వాత ఎవరు బయటపెట్టారు? అనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.
READ MORE: VITAMIN C: విటమిన్ C అధికంగా లభించేందుకు తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే..!
బహిరంగ సభ ముగిసిన తర్వాత మే 2న లెటర్ రాశారు కవిత. దీనికి సంబంధించి ఆమె అమెరికా పర్యటనకు వెళ్లే ముందు రూమర్లు వినిపించినా.. ఇటు బీఆర్ఎస్ నేతలు, అటు తెలంగాణ జాగృతి నేతలు కొట్టిపారేశారు. కవిత అమెరికా టూర్ కన్న ముందే లెటర్ కి సంబంధించిన లీవులు ఉన్న ఎవ్వరూ మాట్లాడలేదు.. సీరియస్ గా తీసుకోలేదు. చివరికి ఆమె హైదరాబాద్ నుంచి అమెరికాకు బయలుదేరిన గంటలోపే లెటర్ బయటికి రావడం ఆసక్తికరంగా మారింది. దాన్ని రిసీవ్ చేసుకున్న కేసీఆర్ బయటపెట్టి అవకాశమే లేదంటున్నారు. ఇక మిగిలి ఉన్న రెండో ఆప్షన్ కవిత వైపు నుంచే.. ఈ అంశం ఆమెకు తెలిసే ఉంటుందని అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
READ MORE: VITAMIN C: విటమిన్ C అధికంగా లభించేందుకు తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే..!
ఎమ్మెల్సీ సూచనలతో ఆమెను అనుచరులే కాఫీని బయటికి వదిలారా? లేదా ఆమెకు తెలియకుండా ఓవర్ రియాక్ట్ అయ్యి బయటపెట్టారా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో బిజీగా ఉన్నాయి రాజకీయ వర్గాలు. ఒకవేళ కవితకు తెలియకుండా ఈ లేఖ బయటికి వస్తే.. ఆమె ఖండించడమో తనకేమీ తెలియదు అంటూ ట్విట్ చేయడమో చేసేవారు. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయాట. దీంతో అటు బీఆర్ఎస్ కూడా ఇందుకు బాధ్యులు ఎవరు? అని తెలుసుకునే పనిలో పడిందట. మొత్తం మీద ఈ అంశంపై అటు బీఆర్ఎస్ నాయకులు ఇటు కేసీఆర్ కుటుంబం ఆ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కాగా.. అసలు లేఖ ఎలా బయటికి వచ్చింది అనే వ్యవహారం కవిత ఆఫీసు చుట్టూ తిరుగుతోంది.