దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ చేపట్టిన "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్"లో భాగంగా గత సంవత్సరం నుంచి భారత రాష్ట్రపతి కార్యాలయ ఆధ్వర్యంలో ఈ వివిధతకా అమృత్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్లు.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. భారతదేశంలోని సాంస్కృతిక, భాషా, సంప్రదాయ వైవిధ్యాన్ని పురస్కరించుకుంటూ "భిన్నత్వం లో ఏకత్వం" అనే స్ఫూర్తిని చాటి చెప్పటమే ఈ కార్యక్రమ లక్ష్యం.
ముంబై నుంచి ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి మరోల్ ప్రాంతంలో ఒక పిచ్చి ప్రేమికుడు తన మైనర్ ప్రియురాలిని కోపంతో సజీవ దహనం చేయాలని చూశాడు. తాను కూడా నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనే సమాచారం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం వారిద్దరూ ముంబైలోని కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి లక్నోలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు(ACJM) రూ.200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసు రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఇచ్చిన ప్రకటనకు సంబంధించినది. డిసెంబర్ 17, 2022న అకోలాలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ పై వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై లక్నోలోని ACJMలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. రాహుల్ గాంధీ ప్రకటన […]
సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. "మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే సమ్మక్క సారక్క, సీతమ్మ సాగర్, వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరంలో మూడో ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వమని చెప్పండి. అప్పుడు మేము మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉందని నమ్ముతాం.
చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో శిరీష హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సరిత, వినయ్ కుమార్, నిహల్ కుమార్ అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పెట్టారు. 2016లో సరిత, శిరీష కలిసి సన్ రైజ్ హాస్పిటల్ లో పని చేశారు.. 2016 ఏప్రిల్ లో వినయ్ కుమార్ తో శిరీష పెళ్లి సెట్ చేసింది సరిత.. శిరీష 2024 లో హయత్ నగర్ వివేరలో కూడా పని చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న వివేర…
ఓ మహిళ జగన్నాథ స్వామి పచ్చబొట్టు వేయించుకోవడంపై వివాదం తలెత్తింది. ఈ విదేశీ మహిళ తన తొడపై జగన్నాథుడి బొమ్మను టాటూగా వేయించుకుంది. ఆ విదేశీ మహిళ భువనేశ్వర్‌లోని ‘రాకీ టాటూస్’ పార్లర్లో ఈ టాటూ వేయించుకుంది. ఇది మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. ఈ అంశంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. టాటూ ఆర్టిస్ట్, పార్లర్ యజమాని రాకీ రంజన్ బిషోయ్‌ను అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ మహిళ తొడపై టాటూ వేసుకోవడంతో పాటు దానికి […]
కేంద్రం ఇస్తోంది.. కానీ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని రేవంత్ అంటున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.. ఇటీవల ఓ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "తెలంగాణకు మోడీ 7 జవహర్ నవోదయ విద్యాలయాలు ఇచ్చారు. నా పార్లమెంట్ పరిధిలో జగిత్యాల, నిజామాబాద్ లో ఒకటి చొప్పున రెండు వచ్చాయి. పార్టీలకతీతంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాను.
ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారికి ఊరట కల్గించేలా ఈ మంత్రి వర్గం నిర్ణయాలు తీసుకుంది.
సింగర్ కల్పన మాత్రలు మింగి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కేబీహెచ్‌బీ పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. సింగర్ కల్పన ఎర్నాకుళంలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. ఆమె నిద్ర పట్టకపోవడంతో జోల్ ఫ్రెష్ నిద్రమాత్రలు వేసుకున్నట్లు వెల్లడించారు. అవి వేసుకున్నా.. నిద్ర రాకపోవడంతో మరో 10 నిద్రమాత్రలు వేసుకొని అపస్మారక స్థితికి వెళ్లినట్లు తెలిపారు.
తెలుగు పాపులర్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హైదరాబాద్‌లోని నిజాంపేటలో వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఘటన జరిగింది. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అందరూ భావిస్తుండగా.. తాజాగా ఆమె కుమార్తె సంచలన వ్యాఖ్యలు దయ ప్రసాద్ చేసింది. తన తల్లి కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేసింది.