కాళేశ్వరం కుంగుబాటుపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సెక్రటేరియట్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో వికృత, వికార మైన విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.జ్యుడీషియల్ కమిషన్ విచారణలో భాగంగా కేసీఆర్, హరీష్ కు నోటీసులు పంపిస్తే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్, హరీష్ నోటీసులకే వణికిపోతున్నారని విమర్శించారు. తాము విచారణకే ఆదేశించామని… ఇంకా చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. వైఎస్ హయాంలో తుమ్మిడిహెట్టి వద్ద శంకుస్థాపన చేసి రూ. 38వేల కోట్లతో ప్రారంభించామన్నారు. తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చారని తెలిపారు. రూ. 38 వేల కోట్లకు డిజైన్, అప్రూవ్ అయ్యిందని.. అదే ఆయకట్టుకు బీఆర్‌ఎస్ అంచనాలు పెంచిందని చెప్పారు.
READ MORE: Vishal : విశాల్ పెళ్లి ఆలస్యానికి ఇంత పెద్ద కారణం ఉందా..?
రైతులకు నీళ్లు ఇవ్వడానికి కాళేశ్వరం కాదు.. వాళ్ళ జేబులు నింపుకోవడానికే అని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. మీరు ఏమి చేయకుంటే నోటీసులకు ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. మీరు అంత బాగా కాళేశ్వరం కట్టి ఉంటే కమిషన్ ముందుకు వెళ్ళి వివరించాలన్నారు. బాంబులు అని అనుమానాలు ఉంటే, ఆధారాలు ఉంటే కమిషన్ కు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని అబద్ధం చెప్పి ప్రాజెక్టు రిడిజైన్ చేసి మేదిగడ్డకు మార్చారన్నారు. కాళేశ్వరం గురించి వాళ్లకు వాళ్ళే గొప్పలు చెప్పుకుంటున్నారని.. కాళేశ్వరం ఖర్చు నాలుగు రేట్లు పెరిగితే నామమాత్రంగా ఆయకట్టు పెరిగిందన్నారు. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు వైట్ ఎలిఫెంట్ అన్నారు.. “కాళేశ్వరం నోటీసులు అందగానే బిఆర్ ఎస్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. గతంలో పేరున్న రాజకీయ నాయకులు కమీషన్ల ముందు హాజరయ్యారు. బీఆర్ఎస్ తీరును ప్రజలు ఖండించాలి. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు కూలింది. బాంబులు అవి ఉంటే అప్పుడు మిరే అధికారంలో ఉన్నారు. పోలీసులు మీ ఆధీనంలో ఉన్నారు. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు.
తప్పుడు ఆరోపణలు చేసినందుకు మీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు కాళేశ్వరం పై నివేదిక ఇచ్చింది. డ్యామ్ సేఫ్టీపై ఎన్‌డీఎస్‌ఏ విచారణ చేసి ఘోర తప్పిదాలు జరిగాయని స్పష్టం చేసింది.” అని మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: Gautam Gambhir: 2027 వరల్డ్ కప్ వరకు కష్టమే.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన గంభీర్..!
కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగిందని. ఘోర తప్పిదాలు జరిగాయని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేదిగడ్డ కు ఎందుకు మార్చారో ఇప్పటికి స్పష్టం చేయలేదని.. అది రైతులకు నీళ్లు ఇవ్వడానికి కాదన్నారు… బీఆర్ఎస్ నేతలు రూ. 62 వేల కోట్ల ప్రజా ధనం వృథా చేశారని ఆరోపించారు. కాళేశ్వరానికి అంచనాలకు మించి 62 వేల కోట్లు ఖర్చు చేశారని.. ఆ వృథా ఖర్చుతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి అయ్యేవని తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ఫ్రా స్ట్రెక్చర్ పనులకు కార్పొరేషన్లు లోన్లు ఇవ్వలేదని.. అలాంటి కార్పొరేషన్ల దగ్గరకు వెళ్లి తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీతో నిధులు తెచ్చారన్నారు. మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి కాళేశ్వరం నిర్మాణం చేశారని విమర్శించారు. కాళేశ్వరంను ఏవిధంగా వినియోగంలోకి తీసుకు రావాలో ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దేశంలోని బ్యారేజ్ నిర్మాణ నిపుణులు అవి నిరుపయోగంమే అంటున్నారని.. జ్యూడిషియల్ కమిషన్ పూర్తిగా స్వతంత్ర సంస్థ అని స్పష్టం చేశారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.