హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది.. పెళ్లయిన నెల రోజులకే గంట విజయ గౌరీ(20) ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న ఆ యువతికి గత నెల ఫిబ్రవరి 6న నందిగామ విజయనగరానికి చెందిన ఈశ్వర రావు(35) తో వివాహం జరిగింది.. మృతురాలి స్వస్థలం పార్వతీపురం. ఉద్యోగ నిమిత్తం నగరానికి వచ్చిన ఈశ్వరరావు బాలనగర్ పీఎస్ పరిధిలోని బాల్ రెడ్డినగర్లో ఇల్లు తీసుకొని అద్దెకు ఉంటున్నాడు.. గత నెల 16 వతేదీన విజయగౌరి వాళ్ల అమ్మతో…
కేసీఆర్ బంధువులు ఆర్టీసీలో బస్సులు అద్దెకు పెట్టుకునే వారని.. కానీ మా ఆత్మ బంధువులు మీరు.. అందుకే ఆర్టీసీ బస్సులు కాంట్రాక్టు మీకే ఇచ్చామని మహిళలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 150 బస్సులు ఇవాళ రోడ్డు మీదకు వచ్చాయని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం నిర్వహించారు.
ఎంపీల మీటింగ్ కి బీజేపీ ఒక్కటే కాదు ఏ పార్టీ హాజరు కాలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, వాట కోసం కొట్లాడేది బీజేపీ తప్ప ఎవరు లేరన్నారు. మమ అనిపించుకునేందుకే సమావేశం నిరహించారని చెప్పారు.. ఢిల్లీ వేదికగా చర్చ చేద్దాం.. 28 అంశాల్లో ఏవేవి పెండింగ్ లో ఉన్నాయో చర్చ చేద్దాం.. ఢిల్లీలో పెట్టండి మీటింగ్ అని సవాల్ విసిరారు. అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని.. రండి ఢిల్లీకి చర్చ చేద్దాం, రేపు పార్లమెంట్ సమావేశాలు…
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ #NKR21లో విజయశాంతి IPS ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు భారీ స్థాయిలో నిర్మిస్తునారు. మహిళా దినోత్సవం సందర్భంగా, NKR21 మేకర్స్ మూవీ ఇంపాక్ట్ ఫుల్ టైటిల్ 'అర్జున్ S/O వైజయంతి' గా రివిల్ చేస్తూ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కళ్యాణ్ రామ్,…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో రూ.500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వందేళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి రూ. 500 కోట్ల నిధులు కేటాయించామన్నారు. అంతర్జతీయ యూనివర్సిటీలతో పోటీ పడాలని విద్యార్థులకు సూచించారు. రాజీవ్ గాంధీ కన్న కళలను నేరేవేరుద్దామన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం సోనియా గాంధీ కృషి చేశారని సీఎం తెలిపారు. రాజకీయాల్లో మహిళలు కూడా రావాలని చెప్పారు.
ట్రోల్ రాయుళ్ళకు మహిళా కమిషన్ సిరియస్ వార్నింగ్ ఇచ్చింది.. చేతి లో ఫోన్ ఉందని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టితే కఠిన చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు.
మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారదన సింగర్ కల్పన కలిసింది. తాను నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసుకున్నానంటూ.. కొన్ని యూట్యూబ్ ఛానల్లు తన ప్రైవేట్ వీడియోలతో ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని కల్పన డిమాండ్ చేసింది. కాగా... అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన గాయని కల్పన కోలుకున్న విషయం తెలిసిందే. తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని దాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ నిన్న ఓ వీడియో విడుదల చేసింది.…
సినీ నటి రన్యా రావు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగారం స్మగ్లింగ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది.. బంగారం స్మగ్లింగ్ చేస్తూ డీఆర్ఏకీ రన్యారావ్ దొరికి పోయిన విషయం తెలిసిందే.. దుబాయ్ నుంచి అక్రమంగా 14 కిలోల బంగారాన్ని తీసుకువస్తూ దొరికింది. ఇప్పటికే రన్యారావ్ ని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. కోర్టు అనుమతితో రన్యా రావును మూడు రోజుల కస్టడికి తీసుకొని విచారిస్తున్నారు.. విచారణలో పలు కీలక విషయాలు చెప్పింది.
కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా? అని తాము కూడా ఎదురుచూస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మీరు అసెంబ్లీకి వచ్చి కూసుంటే.. అన్ని సమస్యలకూ పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. మీరు ఏడు లక్షల కోట్లు చేసింది మీరే కాబట్టి.. ఏం చేశారో చెప్పాలన్నారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ జనం అధికారం నుంచి తరిమేశారు అనే అనుకోవడం లేదని.. జనం మమ్మల్ని మిస్ అయ్యారు అనే అనుకుంటున్నారన్నారు. తప్పేంటి.. ఒప్పేంటి అనే చర్చ లేదని.. కేసీఆర్ మాటలకే అంకితం.. చిత్తశుద్ధి ఉండి ఉంటే..…
నిమ్స్లో యువకుడికి సక్సెస్ ఫుల్గా గుండె మార్పిడి పూర్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.. ప్రస్తుతం పేషెంట్ కోలుకుంటున్నారు.. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డాక్టర్లను అభినందించారు.మంత్రి.. డోనర్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అవయవదానంపై అవగాహన కల్పించాలని డాక్టర్లకు సూచించారు.