తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జరిగింది. రెండు గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయ పరమైన చిక్కులు లేకుండా న్యాయ నిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
మరో మూడు కేసుల్లో రాజా సింగ్ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. గతంలో విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామ నవమి ర్యాలీ అనుమతి ఉల్లంఘనకు సంబంధించిన మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు బీజేపీ శాసనసభ్యుడు టి. రాజా సింగ్ను నిర్దోషిగా ప్రకటించింది. మంగళ్హాట్, షాహినాయత్గంజ్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి.
అతి వేగం ప్రమాదకరం… అనే మాటలు దాదాపు ప్రతి హైవే మీద చదువుతాం. ఎందుకంటే వేగంగా డ్రైవ్ చేసి ప్రమాదానికి గురికావడం కంటే తక్కువ వేగంతో సురక్షితంగా ఇంటికి చేరుకోవడం ఉత్తమం. ఇది ఆ పదబంధం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. కానీ, కొందరు వాహనదారులు మాత్రం ఇవేవీ పట్టించుకోరు. దాంతో భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఇందుకు నిదర్శనంగా జరిగిన ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
ప్రేమించిన యువతి ఇంటి ముందు ప్రేమికుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మైలార్దేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ లింగంపల్లికి చెందిన సోను (21) డిగ్రీ స్టూడెంట్. హౌసింగ్ బోర్డ్ కాలనీ, బృందావనం కాలనీకి చెందిన అంబిక (21) ఎల్ఎల్బీ స్టూడెంట్. ఇద్దరు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు.
నానక్రామ్ గూడలోని ఖాజాగూడ పెద్ద చెరువుతో పాటు.. నెక్నాంపూర్ లోని ఇబ్రహీంబాగ్ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఖాజగూడ చెరువులోకి మురుగు నీరు చేరకుండా కాలువ డైవర్షన్ పనులు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. నెక్నాంపూర్ లోని ఇబ్రహీంబాగ్ చెరువు సుందరీకరణ పనులు స్పీడప్ చేయాలని దత్తత తీసుకున్న సంస్థను కోరారు.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక భారతీయులకు రక్షణ లేదని సీపీఐ నేషనల్ సెక్రటరీ నారాయణ అన్నారు. అమెరికాలో తాజా పరిస్థితిపై ఆయన మీడియాతో మాట్లాడారు. "మోడీ వివిధ దేశాల అధినేతలతో సమావేశాలకే పరిమితం అవుతున్నారు.. ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన దేశం గా ఉన్న అమెరికా బెదిరింపులకు దిగడం సరికాదు.. ఇతర దేశాల సంపదను కొల్ల గొట్టేందుకు అమెరికా ప్రయత్నం చేస్తుంది.. ఎలాన్ మాస్క్ తో డిబేట్ సందర్బంగా విధి రౌడీ లాగ ట్రంప్ ప్రవర్తన ఉంది.. ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ కు వస్తున్నా…
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూ తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే మా లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల పరిస్థితులున్నాయని తెలిపారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. "పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటాం.
SLBC టన్నెల్లో మృతదేహాలు గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ను తీసుకొచ్చారు. రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లలో 2 డాగ్స్ ను తీసుకొచ్చారు. రెస్క్యూ టీమ్ డాగ్స్ ను టన్నెల్ లోకి తీసుకెళ్లాయి. ఐఐటీ నిపుణుల బృందంతో సింగరేణి, NDRF బృందాలు టన్నెల్లోకి వెళ్లాయి... డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్.. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
రాజీవ్ గాంధీపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పెట్టారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ రెండు సార్లు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారన్నారు. అలాంటి వ్యక్తి దేశానికి ప్రధాన మంత్రి ఎలా అయ్యారో అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై దుమారం రేగుతోంది.
అమెరికాలో కేశంపేటకు చెందిన విద్యార్థని కాల్చి చంపారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట గ్రామానికి చెందిన గంప ప్రవీణ్ (27) మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రవీణ్ ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లాడు.