అమెరికాకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు వద్ద భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. కవితకు సంబంధించిన ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. “టీం కవితక్క అంటూ” కటౌట్లు కనిపిస్తున్నాయి. కానీ.. ఈ బ్యానర్లలో ఎక్కడ కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కనిపించడం లేదు. జాగృతి, గులాబీ జెండాలు సైతం కనిపించడం లేదు. అక్కడికి చేరుకున్న అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. సీఎం, సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి. జై కవితక్క అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
READ MORE: Kavitha: కవిత లేఖ బయటకు ఎలా వచ్చింది..? లీకు వీరులెవరు?
కాగా.. ఈ నెల 16 న తన భర్త అనిల్ లో కలిసి అమెరికాకు వెళ్లిన కవిత.. తన కొడుకు కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో తన తండ్రి కేసీఆర్ కు ఆమె ఓ లేఖ రాసినట్లుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. దీనిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మరి దీనిపై కవిత ఎలా స్పందిస్తారో అని రాజకీయ వర్గా్ల్లో ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.