ఆర్ఆర్ఆర్ అంచనా వ్యయం రూ.18,772 కోట్లు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.. రూ.300 కోట్లతో ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరు లేన్ల నేషనల్ హైవే పూర్తి చేస్తామని వెల్లడించారు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లేవారికి సిగ్నల్ ఫ్రీ రోడ్ అవుతుందన్నారు.. పార్లమెంట్ సమావేశాల తర్వాత నితిన్ గడ్కరీ పనులు ప్రారంభిస్తారని తెలిపారు. కాంగ్రెస్ గురుంచి తాను మాట్లాడ దాల్చుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయం లో వాళ్ళ కన్నా ఎక్కువ మాకు ఉందని స్పష్టం చేశారు. అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని.. వాళ్ళు…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఏఐఎమ్ఐఎమ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాన్ని స్వాగతిస్తున్నాము. కేంద్రం పారదర్శకంగా లేదు. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. RRR మంజూరు...మెట్రో మంజూరు కోసం ..బాపు ఘాట్ అభివృద్ధికి ... మూసి ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని అడిగారు.
అన్ని రంగాలలో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమాజంలో మహిళల స్థితిగతులు మారాలని.. ధైర్యంగా సవాళ్లను ఎదురుకొని మహిళలు ముందుకు అడుగులు వేయాలని సూచించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆది నుంచి మహిళలను గౌరవించే సంప్రదాయం మనదని.. మహిళల అభివృద్ధికి, రక్షణకు మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. భూగర్భం ఖనిజాల వెలికితీత నుంచి వినీలాకాశంలో ఫైలట్ వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అన్ని రంగాలలో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని… ఏ…
‘వినాస్త్రీయా జననం నాస్తి. వినాస్త్రీయా గమనం నాస్తి. వినాస్త్రీయా సృష్టి యేవ నాస్తి’ అన్నారో కవి. స్త్రీ లేకపోతే అసలు జననమే లేదు, స్త్రీ లేకపోతె గమనమే లేదు.. స్త్రీ లేకపోతె జీవం లేదు, స్త్రీ లేకపోతె సృష్టే లేదు అని అర్థం. నిజమే స్త్రీ పుట్టినప్పటి నుంచి ఓ కూతురిగా, ఓ సోదరిగా, స్నేహితురాలిగా, ఆపై భార్యగా, తల్లిగా, పిన్ని, పెద్దమ్మ, అత్త, నానమ్మ, అమ్మమ్మ ఇలా ప్రతి దశలోనూ ఎదుటివారి జీవితంలో తనదైన ముద్ర వేస్తుంది స్త్రీ. కాగా.. రేపు (మార్చి…
మహారాష్ట్ర ఎస్పీ అధ్యక్షుడు అబూ అజ్మీ.. మొఘల్ చక్రవరి ఔరంగజేబ్ గొప్ప పాలకుడని, క్రూరుడు కాదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వివాదం ముదరడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మి క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఇందువల్ల ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలిలో పర్యటించారు. సిల్వాసాలో నమో ఆసుపత్రిని ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.2,500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించిన ఆయన ఊబకాయం సమస్యను ప్రస్తావించారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయంతో బాధపడుతారని ప్రధానమంత్రి ఒక నివేదికను ఉటంకిస్తూ అన్నారు. ప్రధానమంత్రి ఈ గణాంకాలను ప్రమాదకరమైనవిగా అభివర్ణించారు.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకికి చెందిన ఫోర్త్ జనరేషన్ డిజైర్ అరుదైన ఘనత సాధించింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఈ కాంపాక్ట్ సెడాన్ 5 స్టార్ రేటింగ్ సాధించిన విషయం తెలిసిందే. పెద్దల భద్రత విషయంలో 5 స్టార్ రేటింగ్, చిన్నారుల భద్రతకు సంబందించి 4 స్టార్ పొందింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ పొందిన తొలి మారుతీ సుజుకీ కారు ఇదే కావడం విశేషం. సేఫ్టీ రేటింగ్ విషయంలో మారుతీ సుజుకీపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ..…
హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ తయారు చేసిన అంబాసిడర్ కార్ల ఉత్పత్తి 1957లో ప్రారంభమైంది. 990వ దశకం మధ్య వరకు దేశంలో అంబాసిడర్ కు ఉన్న క్రేజ్ వేరు. ఈ కారు అప్పట్లో భారతీయులకు ఒక స్టేటస్ సింబల్. భారత్‌లో ఏకైక సామూహిక లగ్జరీ కారు ఇది. 1991లో సరళీకరణ తర్వాత క్రమంగా అంబాసిడర్ కారు కనుమరుగైంది. కానీ 1980ల ప్రారంభంలో ఖర్చెక్కువ, మైలేజ్ తక్కువ కావడంతోపాటు నాసికరం అంబాసిడర్ కార్లను మార్కెట్లోకి విడుదల చేయడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. అదే సమయంలో మారుతీ 800 వంటి…
మారుతి సుజుకి జిమ్నీ కంపెనీలో అత్యల్పంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఆ కంపెనీ తన అమ్మకాలను పెంచుకోవడానికి ప్రతి నెలా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఈ నెలలో జిమ్నీని కొనుగోలు చేస్తే మీకు రూ. 1 లక్ష నగదు తగ్గింపు లభిస్తుంది. అయితే.. కంపెనీ దీనిపై ఎలాంటి ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌ను అందించడం లేదు.
కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్లపై ధర పరిమితిని విధించింది. ఏ సినిమా అయినా సరే టికెట్టు ధర రూ.200 మించకూడదని ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్లపై ధర పరిమితి రూ.200 మించకూడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అన్ని భాషల చిత్రాలకూ ఈ నియమం వర్తిస్తుంది. ఈ నిబంధన ఉల్లంఘించొద్దని మల్టీఫ్లెక్స్‌లకు కూడా ప్రభుత్వం తెలిపింది.