అమ్మ ప్రేమను మాటల్లో వర్ణించలేం.. నవ మాసాలు మోసి జన్మినిచ్చిన పిల్లల్ని అపురూపంగా చూసుకుంటుంది. పిల్లలకు చిన్న దెబ్బ తగిలితే తల్లి ప్రాణం విలవిల్లాడుతుంది.. అలాంటి కన్న బిడ్డను తల్లి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. 80 రోజుల పసికందును బావిలో పడేసి చంపేసింది. ఈ ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు గురువారం వెలికి తీశారు. గుర్తు తెలియని వ్యక్తులు తన కొడుకును అపహరించారని ఆ తల్లి కథ అల్లింది. పోలీసులను సైతం తప్పుదోవ పట్టించింది. చివరికి పోలీసుల ఎదుట తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది.
READ MORE: ACB: రూ. 8 లక్షలు డిమాండ్.. ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ టౌన్ ప్లానర్
దుబ్బాక సీఐ పాలెపు శ్రీనివాస్ వివరాల ప్రకారం.. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రామగళ్ళ శ్రీమాన్, నంగునూరు మండలం నర్మెట్టకు చెందిన కవితకు మూడు ఏళ్ల కిందట ప్రేమ వివాహం జరిగింది. వీరు పుల్లూరులోనే నివాసం ఉంటున్నారు. శ్రీమాన్ ఇటీవల రెండు చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి రావడంతో గ్రామంలో పరువు పోయిందని, అతని అమ్మమ్మ ఊరైన అప్పనపల్లిలో గత రెండు నెలల నుంచి ఉంటున్నారు. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులకు గురి చేస్తుండటంతో కవిత భర్తతో విడిపోవడానికి సిద్ధపడింది. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న పసికందును
తప్పిస్తే.. భర్తను విడిచిపెట్టి హాయిగా ఉండొచ్చని నిర్ణయించుకుంది.
READ MORE: SKN : పర్సెంటేజీ కాదు.. టికెట్ ధరలు తగ్గించండి.. ఎస్కేఎన్ కామెంట్స్
ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పసికందు దీక్షిత్ కుమార్‌ను తీసుకెళ్లి గ్రామశివారులో ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో విసిరేసి వెళ్లిపోయింది. తన దగ్గర నుంచి ఇద్దరు ముసుగు వేసుకొని వచ్చిన దుండగులు బాబును ఎత్తుకెళ్లారని చెప్పి, అందరిని తప్పుదోవ పట్టిస్తూ కిడ్నాప్ జరిగినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చివరికి తల్లే హత్య చేసినట్లు గుర్తించారు.