Anasuya last episode in jabardasth show: జబర్దస్త్ షోలో యాంకర్ అనసూయ ప్రస్థానం మరోసారి చివరి అంకానికి చేరింది. గతంలో ఒకసారి వ్యక్తిగత కారణాల వల్ల అనసూయ జబర్దస్త్ షోను విడిచిపెట్టగా ఆమె స్థానంలో నిర్వాహకులు రష్మీని తెచ్చారు. అయితే కొన్నాళ్లకు అనసూయ తిరిగి రావడంతో జబర్దస్త్ షో నిర్వాహకులు ఎవరినీ నొప్పించకుండా షోను రెండు భాగాలుగా విభజించి ఒక భాగానికి అనసూయను, మరో భాగానికి రష్మీని యాంకర్‌గా కొనసాగిస్తున్నారు. తాజాగా అనసూయ మరోసారి బబర్దస్త్ […]
Virat Kohli in Top Place: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా ఫామ్‌లో లేడు. దీంతో జట్టులో అతడి స్థానంపై మాజీ క్రికెటర్లు ఆరోపణలు చేసే పరిస్థితి నెలకొంది. అయితే మూడేళ్లుగా ఒక్క సెంచరీ చేయకపోయినా టీమిండియా తరఫున అత్యధిక పరుగుల జాబితాలో మాత్రం విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవడం విశేషం. 2019 ప్రపంచకప్ తర్వాత టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీనే. అప్పటినుంచి ఇప్పటివరకు […]
Diarrhea in kolakaluru: డయేరియా కారణంగా గతంలో ఏపీ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన కొలకలూరు గ్రామంలో మరోసారి భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వ్యర్ధాలతో కూడిన నీటిని ఇంటింటికి సప్లై చేస్తున్న పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం ఆ గ్రామ ప్రజలకు శాపంగా మారుతోంది. డయేరియా రావడంతో వందల సంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు చేసిన హడావిడి అప్పుడే మర్చిపోయారు. కొలకలూరు గ్రామంలో సురక్షిత తాగునీటిని అందించే పరిస్థితులు మాత్రం నెలకొనడం లేదు. గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో మళ్లీ డయేరియా […]
Central Government answer on special package to andhra pradesh: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఇటీవల పార్లమెంట్‌లో స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రత్యేక ప్యాకేజీపై కీలక ప్రకటన చేసింది. ఏపీకి 2016లో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇప్పటివరకు 17 ప్రాజెక్టుకు విదేశీ ఆర్ధిక సంస్థల నుంచి రూ.7,797 కోట్ల రుణం అందించామని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ […]
IND Vs WI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా నేడు భారత్-వెస్టిండీస్ మధ్య నామమాత్రపు మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే రెండు వన్డేలలో గెలిచి సిరీస్ గెలిచిన టీమిండియా మూడో వన్డేలోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. అయితే మూడో వన్డేలో జట్టులో పలు మార్పులు జరగనున్నాయి. రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్ లైనప్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా బౌలింగ్‌లో మార్పులు తప్పనిసరిగా కనిపిస్తోంది. అవేష్ ఖాన్ […]
* అల్లూరి సీతారామరాజు జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటన.. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం జగన్.. ఉదయం 9.30 గంటలకు చింతూరు మండలం కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశం కానున్న సీఎం జగన్ * అమరావతి: ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో పీఆర్సీపై ఈరోజు సాయంత్రం 4 గంటలకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కీలక సమావేశం * గుంటూరు: నేడు మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటన, బాదుడే […]
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి లంక గ్రామంలో సీఎం జగన్ ఇంటింటికి తిరిగి వరద బాధితులను పరామర్శించారు. వరద బాధితులందరినీ ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని సీఎం జగన్ తెలిపారు. ఏ వరద బాధితుడికి సహాయం అందలేదనే మాట రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గంటి పెదపూడి లంక గ్రామానికి అవసరమైన బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు. ఏ సీజన్ […]
Ramcharan Movie Shooting: ఆర్.ఆర్.ఆర్ మూవీ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో పనిచేస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. సరూర్ నగర్ వీఎం హోంలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుండగా స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల తరగతులు […]
Commonwealth Games 2022: మరో రెండు రోజుల్లో కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ క్రీడా సంగ్రామం ప్రారంభం కాకముందే భారత్‌కు షాక్ తగిలింది. కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ క్రీడలకు దూరమైనట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ రాజీవ్ మెహతా తెలిపారు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సందర్భంగా నీరజ్ చోప్రా గాయపడ్డాడని.. దీంతో ప్రస్తుతం అతడు ఫిట్‌గా లేడని ఈ కారణంగా బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ […]
Botsa satyanarayana fire on chandrababu: విజయవాడలో ఈఏపీసెట్-2022 ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఏ విషయాన్ని అయినా క్షుణ్ణంగా అర్ధం చేసుకుని మాట్లాడాలని బొత్స సూచించారు. మీడియాలో వచ్చిన వార్తలు చూసి మాట్లాడితే ఎలా అని నిలదీశారు. పుస్తకాల డిమాండ్ గురించి ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలను ముందే అడిగామన్నారు. అయితే వాళ్లు డిమాండ్‌లో 20 శాతం […]