* అల్లూరి సీతారామరాజు జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటన.. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం జగన్.. ఉదయం 9.30 గంటలకు చింతూరు మండలం కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశం కానున్న సీఎం జగన్
* అమరావతి: ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో పీఆర్సీపై ఈరోజు సాయంత్రం 4 గంటలకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కీలక సమావేశం
* గుంటూరు: నేడు మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటన, బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్న నారా లోకేష్
* పల్నాడు జిల్లా: నేడు చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గోనున్న మంత్రి విడదల రజినీ
* నెల్లూరు జిల్లా: పొదలకూరులో ఉజ్వల్ భారత్… ఉజ్వల్ భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
* నేడు కాకినాడలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పర్యటన
* ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో నేడు మరోసారి ఈడీ ముందు హాజరుకానున్న సోనియా గాంధీ
* ఢిల్లీ: నేడు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రతిపక్షాల ఆందోళన.. ఉదయం 9:30 గంటలకు ఖర్గే నివాసంలో ప్రతిపక్ష నేతల భేటీ.. ఉదయం 10:15 గంటలకు కాంగ్రెస్ ఎంపీల సమావేశం.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
* పోర్ట్ ఆఫ్ స్పెయిన్: నేడు భారత్-వెస్టిండీస్ మూడో వన్డే.. రాత్రి 7 గంటలకు మ్యాచ్.. మూడు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో టీమిండియా