Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- పెద్ద రచ్చకు దారితీసిన ఫ్లెక్సీలో ఫోటో వివాదం..
- యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీసీలను అవమానించారంటూ నిరసనలు..
- అగ్గికి ఆజ్యం పోసిన జక్కిడి ప్రభాకర్‌రెడ్డి కామెంట్స్..
- సభ్యత్వం కోసం ఖర్చుపెట్టిన డబ్బు పదవి కోసం ఇచ్చారన్న కోణంలో చర్చ..
- బీసీలపై వ్యాఖ్యలతో కుల సంఘాలు సీరియస్..
- పీసీసీ చీఫ్‌కు మధుయాష్కి ఫిర్యాదు..
- ఫోన్‌కాల్ ఆడియో ఏఐ క్రియేటెడ్ అన్న జక్కిడి ప్రభాకర్‌రెడ్డి..
- తన మాటలకు సారీ చెప్పిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు..
- సారీలతో కథ ముగిసినట్టేనా? ఇంకా ఉందా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: చిన్న ఫ్లెక్సీ వివాదం… పెద్ద రచ్చకు దారి తీసింది. యాదగిరి గుట్ట ఆలయ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో పెట్టిన ఫ్లెక్సీ అగ్గి రాజేసింది. అందులో పార్టీనేత జక్కిడి ప్రభాకర్ ఫోటో పెట్టలేదన్న వ్యవహారం రచ్చకు దారితీసింది. ఫ్లెక్సీలో ఫోటో లేదనే ఎపిసోడ్‌కు సంబంధించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి… ఫోన్ సంభాషణలో నోరు జారినట్టు చెబుతున్నారు. ఆయన మాటలు యాదవ.. గౌడ సామాజిక వర్గాలను కించపరిచేలా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అది మరవక ముందే శివ చరణ్ రెడ్డి తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ మరింత ఆజ్యం పోశాయి. దాంతో పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయింది. ఇద్దరి ఆడియోలు లీక్ అవ్వడమే కాకుండా… అందులోకి pcc చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డిని కూడా లాగడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఏడు కోట్లు ఖర్చు చేసినట్టు ఫోన్లో అవతలి వ్యక్తితో చెప్పుకొచ్చారు ప్రభాకర్‌రెడ్డి. అయితే…. ఇందులో సభ్యత్వం కోసం చెల్లించిన డబ్బును పార్టీకి ఇచ్చారనే కోణంలో చర్చ మొదలవడంతో… పార్టీ నేతలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సభ్యత్వం కోసం కోట్లు ఖర్చుపెట్టామని చెప్పిన మాటలు ఫైనల్‌గా పోస్ట్ కొనుక్కోవడానికి అన్నట్టుగా సోషల్ మీడియాలో చర్చలు మొదలవడంతో కలకలం రేగుతోంది. అంతే కాకుండా… బీసీ నాయకులపై చేసిన వ్యాఖ్యల విషయంలో కుల సంఘాలు సీరియస్‌గా ఉన్నాయి. ఈ విషయంలో చర్యల కోసం కాంగ్రెస్ బీసీ నాయకులంతా… పార్టీ అధినాయకత్వంపై వత్తిడి పెంచుతున్నారట. మధుయాష్కితో పాటు ఎల్బీ నగర్ కాంగ్రెస్ నేతలు పిసిసి చీఫ్‌ను కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు.
Also Read
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
ఐతే మొత్తం ఎపిసోడ్ పై విచారణ జరిపి చర్యల కోసం నివేదిక ఇవ్వాలని ఇప్పటికే పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లాను ఆదేశించారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. వ్యవహారం సీరియస్ అవడంతో… శివచరణ్ తండ్రి ప్రభాకర్ తగ్గారు. తన మాటలతో ఎవరైనా నొచ్చుకుంటే క్షమాపణలు అని చెప్పారు. బయటకు వచ్చిన ఆడియోలు ఏఐ క్రియేటెడ్ అని చెప్పారాయన. అది ఒరిజినలా? ఏఐనా అన్న సంగతి అలా ఉంచితే…. చిన్న విషయం ఇప్పుడు చినికి చినికి గాలి వానలా మారింది. ఈ ఎపిసోడ్ ఎటు దారి తీస్తుందోనన్న సందేహాలు కూడా పార్టీ వర్గాల్లో పెరుగుతున్నాయి. మరోవైపు ఈ ఎపిసోడ్‌పై సీఎం రేవంత్ సీరియస్‌గా ఉన్నారట. అటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పారు. నేను బీసీలకు వ్యతిరేకం కాదు.. నా ఎదుగుదల ఓర్వలేక కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. ఈ ఎపిసోడ్ ను ఇంతటితో వదిలేయండి అంటూ వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశారాయన. తండ్రీ కొడుకుల సారీలతో కథ ముగిసినట్టేనా? లేక ఇంకా ఉందా అన్నది తేలాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందేనంటున్నారు రాజకీయ పరిశీలకులు.
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!