Anasuya last episode in jabardasth show: జబర్దస్త్ షోలో యాంకర్ అనసూయ ప్రస్థానం మరోసారి చివరి అంకానికి చేరింది. గతంలో ఒకసారి వ్యక్తిగత కారణాల వల్ల అనసూయ జబర్దస్త్ షోను విడిచిపెట్టగా ఆమె స్థానంలో నిర్వాహకులు రష్మీని తెచ్చారు. అయితే కొన్నాళ్లకు అనసూయ తిరిగి రావడంతో జబర్దస్త్ షో నిర్వాహకులు ఎవరినీ నొప్పించకుండా షోను రెండు భాగాలుగా విభజించి ఒక భాగానికి అనసూయను, మరో భాగానికి రష్మీని యాంకర్‌గా కొనసాగిస్తున్నారు. తాజాగా అనసూయ మరోసారి బబర్దస్త్ షోను విడిచి వెళ్లిపోతుంది. ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ అనసూయకు చివరిది. ఈ మేరకు ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో కంటెస్టెంట్లు, న్యాయనిర్ణేతలు ఎమోషనల్ అయినట్లు చూపించారు. ఈ వేదిక నిన్ను ఎంతగానో మిస్ అవుతుంది అంటూ ఇంద్రజ కన్నీటి పర్యంతమయ్యారు.
2013లో జబర్దస్త్ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 500 ఎపిసోడ్లకు అనసూయ యాంకరింగ్ చేశారు. ఈ షోతో అనసూయ ఎంతో పేరు, ప్రఖ్యాతలు సంపాదించింది. టీవీ న్యూస్ రీడర్‌గా ఆకట్టుకోకపోయినా ఈ షో ద్వారా యాంకరింగ్‌తో అందరినీ అనసూయ తనవైపుకు తిప్పుకుంది. అయితే అనసూయ ఈ షోను విడిచిపెట్టడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నిర్వాహకులతో విబేధాలు, రెమ్యూనరేషన్ నచ్చకపోవడం ప్రధాన కారణాలు కావచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు.
Read Also: Lucky Family: అదృష్ట కుటుంబమంటే ఇదే.. అప్పులతో కాసేపట్లో ఇల్లు అమ్మాల్సిన స్థితిలో..
అటు ప్రోమోలో అనసూయ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఈ షోను వీడి వెళ్లిపోవడం పట్ల కొంచెం కూడా బాధ లేదన్నట్లుగా వ్యవహరించింది. ఇటీవల జబర్దస్త్ వీడిన రోజా సైతం తన చివరి ఎపిసోడ్ లో కన్నీటి పర్యంతం అయ్యారు. తప్పక జబర్దస్త్ వీడాల్సి వస్తుందని వెల్లడించారు. అనసూయలో ఏదో కోల్పోతున్నామన్న భావన కొంచెం కూడా కనిపించలేదు. దీంతో రాకెట్ రాఘవ ఆమెకు పరోక్షంగా చురుకలు వేశాడు. జబర్దస్త్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది, ఇంకా చాలా మందికి లైఫ్ ఇస్తుంది. ఎవరు ఉన్నా లేకున్నా జబర్దస్త్ ఆగదు. కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు. మంచి మంచి కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటారని అనసూయ ముందే స్పష్టం చేశాడు. ప్రస్తుతం అనసూయ క్రేజీ సినిమా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. ఆమె చేతిలో పుష్ప2, రంగ మార్తాండ వంటి సినిమాలున్నాయి.