Commonwealth Games 2022: మరో రెండు రోజుల్లో కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ క్రీడా సంగ్రామం ప్రారంభం కాకముందే భారత్‌కు షాక్ తగిలింది. కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ క్రీడలకు దూరమైనట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ రాజీవ్ మెహతా తెలిపారు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సందర్భంగా నీరజ్ చోప్రా గాయపడ్డాడని.. దీంతో ప్రస్తుతం అతడు ఫిట్‌గా లేడని ఈ కారణంగా బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనబోడని ఆయన వెల్లడించారు
Read Also: Donation With Begging: మనుషుల్లో ఆణిముత్యం.. భిక్షాటన చేసి రూ.50 లక్షలు దానం ఇచ్చిన వృద్ధుడు
కాగా ఇటీవల జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు. జావెలిన్‌ను 88.13 మీటర్లు విసిరి భారత్‌కు పతకం అందించాడు. 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు ఇది రెండో పతకం మాత్రమే. గతంలో మహిళా అథ్లెట్ పతకం నెగ్గగా పురుషులలో మాత్రం ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్ నీరజ్ చోప్రానే కావడం విశేషం. 2003లో పారిస్ వేదికగా జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళా అథ్లెట్ అంజు బాబి జార్జ్ లాంగ్ జంప్ విభాగంలో కాంస్య పతకం గెల్చుకున్నారు. అయితే ఆ టోర్నీ ఫైనల్‌లో తాను కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నానని నీరజ్ చోప్రా స్వయంగా మీడియాకు చెప్పాడు. పరుగెత్తుతున్నప్పుడు కాళ్లలో ఇబ్బందిగా అనిపించిందని పేర్కొన్నాడు. తొడ కండరాలు పట్టేశాయని వివరించాడు. అయితే నీరజ్ చోప్రా త్వరగానే కోలుకుని కామన్వెల్త్ గేమ్స్ ఆడతాడని అందరూ భావించారు.
Neeraj Chopra will not take part in #CommonwealthGames2022. He is not fit as he got injured in the finals of World Athletic Championship. He informed us about this: Rajeev Mehta, Secretary General, IOA to ANI
(File photo) pic.twitter.com/5QgbMaZHuw
— ANI (@ANI) July 26, 2022