IND Vs WI: నేడు మూడో వన్డే.. క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs WI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా నేడు భారత్-వెస్టిండీస్ మధ్య నామమాత్రపు మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే రెండు వన్డేలలో గెలిచి సిరీస్ గెలిచిన టీమిండియా మూడో వన్డేలోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. అయితే మూడో వన్డేలో జట్టులో పలు మార్పులు జరగనున్నాయి. రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్ లైనప్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా బౌలింగ్‌లో మార్పులు తప్పనిసరిగా కనిపిస్తోంది. అవేష్ ఖాన్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ ఆడే ఛాన్స్ ఉంది. తొలి వన్డేలో ప్రసిధ్ కృష్ణ, రెండో వన్డేలో అవేష్ ఖాన్ దారుణంగా విఫలమయ్యారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా తొలి రెండు వన్డేల్లో ఆడలేదు. దీంతో మూడో వన్డేలో అయినా ఆడతాడో లేదో చూడాలి. ఒకవేళ ఆడితే ఎవరి స్థానం భర్తీ చేస్తాడన్న విషయం ఆసక్తికరంగా మారింది. జడేజా కోసం ప్రధాన స్పిన్నర్ చాహల్‌ను తప్పిస్తారా లేదా రెండో వన్డేలో గెలుపు రుచి చూపించిన అక్షర్‌పటేల్‌ను తప్పిస్తారా అన్నది వేచి చూడాలి.
Read Also:5G Auction: ‘5జీ’ వేలానికి సూపర్ రెస్పాన్స్.. తొలిరోజే ఇలా..
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
మరోవైపు జట్టులో సమర్థులైన ఆటగాళ్లు ఉన్నా వెస్టిండీస్ వరుస ఓటములకు కారణాలను అన్వేషిస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్ చేతిలోనూ విండీస్ వరుసగా మూడు వన్డేల్లో ఓడింది. ఇప్పుడు టీమిండియాతో తొలి రెండు వన్డేల్లో అదే ఫలితం. హోప్, పూరన్, మేయర్స్, రోమన్ పావెల్‌పై విండీస్ అతిగా ఆధారపడుతోంది. ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలున్నాయి. బౌలింగ్ విభాగంలోనూ విండీస్ తేలిపోతోంది. ఆ జట్టుకు పేస్ బౌలింగ్ వనరులు బాగానే ఉన్నా స్పిన్ విభాగంలో బలహీనంగా కనిపిస్తోంది. మరి మూడో వన్డేలో ఆ జట్టు బౌలర్లు ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతారో చూడాల్సిందే. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ డీడీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!