StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్‌ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్‌ఫోన్ వచ్చేసింది
- చిటికెలో అన్ని పనులు చేసేస్తుంది
- మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగులు రూపకల్పన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రపంచం ఏఐ యుగంలో నడుస్తోంది. ఇప్పుడు ఏకంగా ఏఐ మొబైల్ కూడా వచ్చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ స్మార్ట్‌ఫోన్‌ను చైనా విడుదల చేసింది. 2023లో మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగులు స్థాపించిన చైనీస్ ఏఐ స్టార్టప్ స్టెప్‌ఫన్.. ప్రపంచంలోనే మొట్టమొదటి మాస్-మార్కెట్ ఏఐ స్మార్ట్‌ఫోన్ అయిన స్టెప్‌ఎక్స్ నియోను విడుదల చేసింది. ఈ ఫోన్లో స్టెప్ అము అనే అంతర్నిర్మిత ఏఐ ఏజెంట్ ఉంది. ఇది స్టెప్‌ఫన్ సొంత ఓఎస్ అయిన స్టెప్ ఏఓఎస్పై పూర్తిస్థాయి పనులను స్వయంగా నిర్వహిస్తుంది. స్టెప్ అము నెట్వర్క్ కనెక్టివిటీ లేకుండా కూడా పనిచేయగలదు. ఒకే సహజ-భాషా అభ్యర్థన ఆధారంగా బహుళ-దశల పనులను చేయగలదు. ఒక్క మాట చెబితే చాలు.. అన్ని పనులు అదే చేస్తుంది.
వినియోగదారుల తరఫున స్వయంగా పనులు పూర్తి చేసే సామర్థ్యంతో ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. స్టెప్‌ఫన్ అభివృద్ధి చేసిన సొంత ఏఐ మోడల్, ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్లో ‘స్టెప్ అమూ (Step Amoo)’ అనే ఏఐ అసిస్టెంట్‌ను అందించారు. వినియోగదారు కేవలం వాయిస్ కమాండ్ ఇవ్వగానే వివిధ యాప్‌ల మధ్య మారుతూ బహుళ దశల్లో ఉండే పనులను స్వయంగా పూర్తి చేస్తుంది. దీంతో యాప్‌లను విడివిడిగా ఓపెన్ చేసి పని చేయాల్సిన అవసరం ఉండదని కంపెనీ వెల్లడించింది.
Also Read
- Stock Market Crash: నాలుగు రోజుల్లో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ఐదు కారణాలు ఇవే..
- EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
- PM Kisan: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ రోజే డబ్బులు ఖాతాల్లోకి జమ..
- Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
32 భాషల్లో లైవ్ అనువాదం
స్టెప్‌ఎక్స్ నియోలో 32 భాషలకు లైవ్ ట్రాన్స్లేషన్ సదుపాయం ఉంది. విదేశీ ప్రయాణాల సమయంలో రియల్‌టైమ్‌లో భాషలను అనువదించడంతో పాటు ప్రయాణ ప్రణాళికను కూడా ఏఐ అసిస్టెంట్ స్వయంగా సిద్ధం చేస్తుంది. విమాన టికెట్లు బుక్ చేయడం, హోటల్ రిజర్వేషన్, పూర్తి ట్రావెల్ ఇటినరీ రూపొందించడం వంటి పనులను యాప్‌లు మార్చాల్సిన అవసరం లేకుండానే నిర్వహించగలదు.
ఇంటర్నెట్ లేకున్నా కొన్ని సేవలు
వినియోగదారు ఫోన్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో నేర్చుకునే సామర్థ్యం ఈ ఏఐకి ఉంది. అంతేకాకుండా ఇంటర్నెట్ లేకున్నా వీసా గడువు గుర్తుచేయడం, కస్టమ్స్‌కు సంబంధించిన సమాచారం అందించడం వంటి కొన్ని సేవలను కూడా అందించగలదని కంపెనీ తెలిపింది. స్టెప్‌ఫన్ సంస్థ అలీపే (Alipay), డిడి (Didi), సీట్రిప్ (Ctrip) వంటి ప్రముఖ డిజిటల్ సేవలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో చెల్లింపులు, క్యాబ్ బుకింగ్, ప్రయాణ సేవలను ఒకే ఏఐ అసిస్టెంట్ ద్వారా మరింత సులభంగా వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఏజెంటిక్ ఏఐ టెక్నాలజీతో రూపొందిన ఈ స్మార్ట్‌ఫోన్ భవిష్యత్ మొబైల్ అనుభవాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!