నేడు తెలంగాణ గ్రీన్ & రెన్యువబుల్ ఎనర్జీ పాలసీపై భాగస్వాములతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండును తీర్చడానికి.. జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోడానికి.. తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రతిపాదిస్తుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం కలకలం రేపుతోంది. నవీపేట్ మండలంలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. మండల కేంద్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు పాఠశాలకు వెళ్తొస్తామని చెప్పి మిస్సింగ్ అయ్యారు.
ఉమ్మడి మెదక్ జిల్లాపై చలి పంజా విసురుతుంది. చలికి జనం గజగజ వణుకుతున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోయాయి. రాష్ట్రంలోనే కనిష్ట ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదు చేసుకుంది.
హైదరాబాద్‌లోని పాతబస్తీ, మదన్నపేట, ఉప్పర్ గూడాకి చెందిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. శబరిమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎరుమెలి నుండి పంపా నది శబరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (శుక్రవారం) రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది జనవరి 3న సావిత్రిబాయి ఫులే జయంతిని మహిళా టీచర్స్ డే నిర్వహించాలని ఉత్తర్వుల్లో తెలిపింది.
ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్సీ కవిత జవాబు చెప్పి ధర్నా చేయాలని తెలిపారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీసీలను వంచించడమే కాకుండా వారికి అందాల్సిన నిధులను ఖర్చు చేయకుండా నిట్టనిలువునా ముంచిందని ఆరోపించారు.
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి ఈడీ అధికారులను రావాలని కోరింది. ఈ క్రమంలో నోటీసులు జారీ చేశారు. 8, 9వ తేదీల్లో బీఎల్‌ఎన్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌లు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది.
ప్రాణ సమానులైన మన బీఆర్ఎస్ తోబుట్టువుల్లారా.. గత ఏడాది కాలంగా ఈ కాంగ్రెస్ నిరంకుశ పాలనపై గులాబీ సైనికులందరూ కనబరిచిన పోరాట స్ఫూర్తికి పేరుపేరునా ప్రతి ఒక్కరికి శిరస్సువంచి సలాం చేస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో తెలిపారు. గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా.. మీరు క్షేత్రస్థాయిలో కనబరిచిన కదనోత్సాహం.. రాష్ట్ర స్థాయిలో పని చేసే నాయకత్వంలో కూడా మాటలకందని స్థాయిలో కొండంత స్ఫూర్తి నింపిందని తెలిపారు.
మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఘటనలో వార్డెన్ ప్రీతి రెడ్డిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. రహస్యంగా కెమెరాలు పెట్టి రికార్డు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని సీఎంఆర్ కాలేజ్ విద్యార్థులు ఉదయం ఆందోళన చేపట్టారు. దీంతో.. కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థినిలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత ఇప్పటికే జైలుకు వెళ్లింది.. కేటీఆర్ కూడా రేపో మాపో అరెస్టు అవుతారని అన్నారు. హరీష్ రావు, కేసీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.