మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఘటనలో వార్డెన్ ప్రీతి రెడ్డిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. రహస్యంగా కెమెరాలు పెట్టి రికార్డు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని సీఎంఆర్ కాలేజ్ విద్యార్థులు ఉదయం ఆందోళన చేపట్టారు. దీంతో.. కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థినిలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టల్ బాత్రూమ్‌ల్లో సీసీ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినిలు ఆరోపించారు. తాము స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Read Also: Kadiyam Srihari: కేటీఆర్ రేపో, మాపో జైలుకు పోవడం ఖాయం.. కడియం ఆసక్తికర వ్యాఖ్యలు
తమ ప్రైవసీపై దాడి జరిగిందని ఆరోపిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు నినాదాలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద దుమారాన్ని రేపింది. మరోవైపు.. ఏబీవీపీ మహిళా నేతలు.. విద్యార్థినులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని.. ఈ ఘటనకు కారకులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ ఘటనపై ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ చేపట్టాం. బాత్‌రూమ్‌ల కిటికీల వద్ద ఫింగర్‌ప్రింట్లు సేకరించి, సాంకేతిక ఆధారాలను అన్వేషిస్తున్నాం. హాస్టల్ సిబ్బందిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేశారు. వారి మొబైల్ ఫోన్లు పరిశీలించి, ఎటువంటి రికార్డింగ్‌లు ఉన్నాయో తెలుసుకుంటాం. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
Read Also: Game Changer: ప్యూర్ గూస్ బంప్స్.. గేమ్ చేంజర్ ట్రైలర్ అదిరింది బాసూ!
మరోవైపు.. ఈ విషయం తెలుసుకుని రాష్ట్ర ఉమెన్ కమిషన్ మెంబర్ పద్మజా రమణ సీఎంఆర్ గర్ల్స్ కాలేజ్‌కు చేరుకున్నారు. విద్యార్థినిలతో కలిసి మాట్లాడారు. సీఎంఆర్ గర్ల్స్ కాలేజీలో జరిగిన ఘటనపై స్టూడెంట్స్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశాము.. చాలా మంది విద్యార్థినిలతో మాట్లాడామని తెలిపారు. స్టూడెంట్స్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు.. పూర్తి వివరాలు ఉమెన్ కమిషన్ చైర్మన్‌కి అందజేస్తామని చెప్పారు. ఉమెన్ కమిషన్ చైర్మన్ ఈ ఘటనపై సుమోటాగా కేసు తీసుకున్నారన్నారు. అలాగే.. సీఎంఆర్ కాలేజ్ మేనేజ్మెంట్‌కి నోటీసులు ఇచ్చామని చెప్పారు. విచారణలో నిజాలు తెలిన తర్వాత సీఎంఆర్ గర్ల్స్ కాలేజీ యాజమాన్యంపై సీరియస్ యాక్షన్ ఉంటుందని అన్నారు. ఆధారాలు సేకరిస్తున్నాం.. ఇక్కడ జరిగిన వాస్తవాలు రిపోర్ట్ రూపంలో రాష్ట్ర ఉమెన్ కమిషన్ చైర్మన్‌కు అందజేస్తామని చెప్పారు.