తెలంగాణ రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను తీసుకొస్తుంది. ఈ క్రమంలో మంత్రి సీతక్క రేపు సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించనున్నారు. ప్రజా భవన్ వేదికగా ఉదయం 9.30 గంటలకు మంత్రి వాహనాలను ప్రారంభించనున్నారు.
తాడిపత్రిలో ప్రముఖ ఫ్యాషన్ షోరూం కాసం షోరూంను సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రారంభించారు. షోరూమ్‌లో అన్ని వయసుల వారికి సరిపోయే చీరలతో సహా అనేక రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. కాసం సంస్థల చైర్మన్ కాసం నమశివాయ మాట్లాడుతూ.. తాడిపత్రిలో కాసం ఫ్యాషన్ షో ప్రారంభించామన్నారు. తమ సంస్థ వరంగల్‌లో మొదటి స్టోర్‌ను ప్రారంభించామని.. అనంతరం రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ప్రాంతాల్లో కూడా తమ స్టోర్స్ ఓపెన్ చేశామని తెలిపారు.
ఆర్.ఎస్.బ్రదర్స్ విశాఖపట్నంలో అతిపెద్ద షోరూమ్‌ను జగదాంబ సెంటర్‌లో జనవరి 2న సగర్వంగా శుభారంభం చేసింది. సాగర తీరంలో షాపింగ్ అనుభవాన్ని అందించే ఈ సరికొత్త షోరూమ్.. అటు సంప్రదాయ వస్త్ర ప్రియుల్ని, ఇటు అధునాతన జీవనశైలిని అభిమానించే వారిని సమానంగా ఆకర్షించే స్థాయిలో రూపుదిద్దుకోవటం విశేషం.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్త సంవత్సరం వేళ విషాదం చోటు చేసుకుంది. క్లాస్ మెట్కు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన బాలుడు.. సాయంత్రం సూసైడ్ చేసుకున్న వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో ఈ ఘటన జరిగింది. భీముని మల్లా రెడ్డి గ్రామానికి చెందిన శివ కిషోర్ (17) అనే 10వ తరగతి విద్యార్థి.. అదే గ్రామానికి చెందిన అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు. ఈ క్రమంలో శివ కిషోర్ పై విద్యార్థిని కుటుంబ…
పాన్ ఇండియా స్టార్ పుష్ప (అల్లు అర్జున్) అరెస్ట్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. RRR అలైన్మెంట్ మార్చి రైతులను మోసం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసిందని ఎంపీ దుయ్యబట్టారు. RRR విషయంలో దోచుకునే, దాచుకునే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదని అభిప్రాయపడ్డారు.
రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసాపై ఈరోజు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చించారు.
కేంద్ర ప్రభుత్వం ఖేల్‌రత్న అవార్డులు గురువారం ప్రకటించింది. నలుగురికి ఖేల్‌రత్న అవార్డులు ఇవ్వనుంది. వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ కుమార్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, షూటింగ్‌లో ఒలింపిక్స్ పతక విజేత మనుభాకర్‌లకూ కేంద్రం ఈ అవార్డులు ప్రకటిచింది. ఈ నెల 17న ప్రదానం చేయనున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరం వేడుక జోష్ లో యువత మునిగిపోయింది. కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం గండికోటకు వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి స్కార్పియో బోల్తా పడింది. ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు.
నూతన సంవత్సర వేడుకలకు విజయవాడ నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 31 వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల జోష్‌లో ఉన్నారు. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు విజయవాడ నగర ప్రజలు రెడీ అయ్యారు.
తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. 2025లో మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.