ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 6 పరుగుల తేడాతో రాజస్థాన్ గెలుపొందింది.
ఐపీఎల్‌లో బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. బ్యాటర్లు సిక్సులు, బౌండరీలతో చెలరేగుతుంటే.. బౌలర్లు డాట్ బాల్స్‌తో పాటు వికెట్లు తీసుకుంటున్నారు. అయితే.. బౌలర్లు ఎక్కువ వికెట్లు సాధిస్తే వారికి పర్పుల్ క్యాప్ అందించి ప్రోత్సహిస్తున్నారు. దీంతో.. బౌలర్లు తమ సత్తాను చాటుతున్నారు.
ఐపీఎల్ 2025లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య మ్యాచ్ జరగనుంది. గౌహతీలోని బర్సపర క్రికెట్ స్టేడియం వేదికగా కాసేపట్లో ప్రారంభం కానుంది. అందులో భాగంగా.. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2025లో భాగంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. ఇంకా 24 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. 164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సునాయసంగా ఛేదించింది.
ఐపీఎల్ 2025లో భాగంగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 36 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపొందింది. 197 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. చివరి వరకు పోరాడి ఓడిపోయింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా.. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి ఎంఎస్ ధోని మరింత సహకారం అందించగలడని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ధోని జట్టుకు తక్కువ ఉపయోగం అవుతున్నారు.. అతను మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని మంజ్రేకర్ సూచించాడు.
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో రాహుల్ జట్టులోకి చేరే అవకాశం ఉంది. తనకు కూతురు పుట్టిన కారణంగా.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు రాహుల్ దూరంగా ఉన్నాడు. అయితే.. మార్చి 30న వైజాగ్‌లో జరిగే మ్యాచ్‌లో అతను ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశముందని ఆ జట్టు ఆటగాడు విపరాజ్ నిగమ్ తెలిపారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌లో భాగంగా తొమ్మిదవ మ్యాచ్ శనివారం గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా.. ఈరోజు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. కాగా.. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో.. జట్టుకు మరింత బలం చేకూరనుంది.