Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!
- మొదటి ప్రయత్నంలోనే UPSC క్లియర్
- రోజువారీ కూలీ కుమారుడు...
- శ్రమతో గొప్ప విజయాన్ని అందుకున్న సుబ్రమణియా భారతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Subramaniya Bharathi: ఎన్నో కష్టాలు ఎదురుకొని గొప్ప విజయం సాధించాలంటే అంతసులువు ఏమి కాదు.. ఎంత కష్టపడేతత్వం ఉన్నా సరైన సహకారం లేక ఎందరో మహానుభావులు ఎదగలేకపోయారు. అయితే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే లక్ష్యంవైపు గట్టిగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది లేదంటూ రుజువు చేశాడు ఓ రోజువారీ కూలి వ్యక్తి కుమారుడు. కలలను నిజం చేస్తూ చెన్నైకి చెందిన “సుబ్రమణియా భారతి” (Subramaniya Bharathi) మొదటి ప్రయత్నంలోనే ప్రతిష్ఠాత్మకమైన UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలలో విజయాన్ని అందుకున్నాడు.
Ring Roads In Telangana: తెలంగాణ జిల్లాలకు మహర్దశ.. ప్రతీ జిల్లాకో రింగు రోడ్డు..
Also Read
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
- Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
ఇటుక తయారీ యూనిట్‌లో రోజువారీ కూలీగా పనిచేసే తండ్రి కుమారుడైన అతని విజయగాథ ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. అతి సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన భారతి విజయం వెనుక కఠినమైన శ్రమతో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కీలక పాత్ర పోషించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న “నాన్ ముదల్వన్ స్కీం” (Naan Mudhalvan Scheme) కూడా అతని విజయానికి దోహదం చేసింది.
ఈ పథకం ద్వారా విద్యార్థులకు మార్గదర్శనం, నైపుణ్య శిక్షణ, కెరీర్‌కు సంబంధించిన సహాయం అందుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ప్రత్యేక మెంటరింగ్, అధ్యయన వనరులు అందించడంతో భారతి తన మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నాడు. ఫలితాలు వచ్చిన తర్వాత తన అనుభవాన్ని పంచుకున్న భారతి, ఈ ప్రయాణం అద్భుతంగా అనిపించిందని.. “ఇది నా మొదటి ప్రయత్నం. నాన్ ముధల్వన్ పథకం అందించిన సహాయంతోనే నేను మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించగలిగానన్నాడు. ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం, అలాగే కోచింగ్ సెంటర్ నా సన్నద్ధతలో ఎంతో కీలకంగా నిలిచాయని తెలిపారు.
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్’పై మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు
భారతి మాట్లాడుతూ.. తాను కేవలం 18 ఏళ్ల వయస్సులోనే సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా ఈ ప్రయాణాన్ని ప్రారంభించానని వెల్లడించాడు. ఆ సమయంలో తనకు మార్గదర్శనం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, తల్లిదండ్రులే తనకు ప్రధాన ప్రేరణగా నిలిచారని చెప్పారు. నా తల్లి, తండ్రే నా మొదటి ప్రేరణ. వారు ఎప్పుడూ దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని నన్ను ప్రోత్సహించారని అన్నారు. భారతి దృష్టిలో సివిల్ సర్వీసెస్ అనేది కేవలం ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగం మాత్రమే కాదని.. సమాజంలోని సాధారణ ప్రజల సమస్యలను పరిష్కరించి, పేద వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఇది ఉత్తమ వేదిక అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
🚨 Subramaniya Bharathi, the son of a laborer and a TN government school student educated in Tamil medium, has cleared the UPSC in his first attempt. (📹️ -ANI)
You can smell a future CEO just by listening. 👌 pic.twitter.com/JG4q8VEMh0
— Indian Tech & Infra (@IndianTechGuide) March 12, 2026
తాజావార్తలు
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!