KTR: గులాబీ సైనికుల పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నా..
- గత ఏడాది కాలంగా కాంగ్రెస్ నిరంకుశ పాలనపై గులాబీ సైనికులందరూ..
- కనబరిచిన పోరాట స్ఫూర్తికి పేరుపేరునా ప్రతి ఒక్కరికి శిరస్సువంచి సలాం చేస్తున్నా- కేటీఆర్
- మీరు క్షేత్రస్థాయిలో కనబరిచిన కదనోత్సాహం..
- రాష్ట్ర స్థాయిలో పని చేసే నాయకత్వంలో కొండంత స్ఫూర్తి నింపింది- కేటీఆర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రాణ సమానులైన మన బీఆర్ఎస్ తోబుట్టువుల్లారా.. గత ఏడాది కాలంగా ఈ కాంగ్రెస్ నిరంకుశ పాలనపై గులాబీ సైనికులందరూ కనబరిచిన పోరాట స్ఫూర్తికి పేరుపేరునా ప్రతి ఒక్కరికి శిరస్సువంచి సలాం చేస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో తెలిపారు. గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా.. మీరు క్షేత్రస్థాయిలో కనబరిచిన కదనోత్సాహం.. రాష్ట్ర స్థాయిలో పని చేసే నాయకత్వంలో కూడా మాటలకందని స్థాయిలో కొండంత స్ఫూర్తి నింపిందని తెలిపారు. తెలంగాణ గ్రామ గ్రామాన ఉన్న గులాబీ సైనికులు.. రాష్ట్ర ప్రజల పక్షాన విరామం ఎరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన ఈ తుగ్లక్ పాలన వల్ల కష్టకాలంలో ఉన్న రైతుల పక్షాన మీరు పోరాడారు.. నేతన్నల గొంతుకై మీరు నిలిచారు.. మహిళా సమస్యలపై మీరు గర్జించారు.. బడుగు బలహీనవర్గాల ప్రజల గళమయ్యారు.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన సమరభేరి మోగించారు.. నిరుద్యోగుల హక్కుల కోసం కాంగ్రెస్ సర్కారును నిలదీశారు.. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీల గారడీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారని కేటీఆర్ తెలిపారు.
CMR College: సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వార్డెన్ సస్పెండ్..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
“మూసీలో మూటలవేట” నుంచి “లగచర్ల లడాయి” వరకూ.. అన్యాయం జరిగిన ప్రతిచోటా బాధితుల పక్షాన మీరు కొట్లాడారని పేర్కొ్న్నారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడును అడుగుడుగునా మీరు ప్రతిధ్వనించారు.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు మీరు చేసిన పోరాటాలు.. చరిత్రపై చెరగని సంతకాలు అని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను అత్యంత సమర్థంగా తిప్పికొట్టిన సందర్భాలు.. ఈ పోరాట పథంలో నిలిచి ఉండే మైలురాళ్లని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. అసమర్థ, అనాలోచిత కాంగ్రెస్ విధానాలపై బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన “జంగ్ సైరన్” ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించిందని తెలిపారు. మీ అలుపెరగని పోరాటాల వల్లే అదానీ ఆశ జూపిన రూ.100 కోట్లను ప్రభుత్వం వెనక్కి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. లగచర్ల లడాయి.. యావత్ దేశం ముందు నియంతృత్వ కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టిందని ఆరోపించారు. ఎన్నో అక్రమ కేసులు పెట్టినా.. ప్రభుత్వం ఎంత వేధించాలని చూసినా.. మొక్కవోని ధైర్యంతో మీరు నిలబడ్డ తీరు అపూర్వం.. అసాధారణం.. చారిత్రాత్మకమని కొనియాడారు.
Cafe Owner Suicide: ‘‘భార్య, అత్తమామలు తీవ్రంగా హింసించారు’’.. ఆత్మహత్యకు ముందు పునీత్ వీడియో..
దశాబ్దాలపాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను.. కుక్కలు చింపిన విస్తరిలా మార్చే కాంగ్రెస్ కుట్రలను అడుగడుగునా ప్రశ్నిద్దాం ! నిలదీద్దాం!! అడ్డుకుందాం!!! అని కేటీఆర్ పిలుపునిచ్చారు. మన పార్టీకి పునాది రాళ్లు మీరే.. మన BRSకు మూలస్తంభాలు మీరే.. మన గులాబీ జెండాకు.. వెన్నుముక మీరే అన్నారు. పార్టీ తరఫున నిలబడి.. కలబడే.. నేటి అలుపెరగని పోరాట యోధులే.. రేపటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై బీఆర్ఎస్ పక్షాన మెరిసే.. వజ్రాయుధాలు అని అభివర్ణించారు. గులాబీ సైనికులందరికీ గుండెల నిండా మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!