రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ. 35 కోట్లతో పలు రోడ్లు, కమ్యూనిటీ హల్స్ శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. మహిళ సాధికరితకు రూ. 80 కోట్ల నిధులు మంజూరు చేశారు.
గుంటూరులో నివాసం ఉండే షేక్ మల్లిక సొంతూరు పెదకాకాని మండలం నంబూరు గ్రామం. పదేళ్ళ క్రితం అదే గ్రామానికే చెందిన అక్బర్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరూ సంతానం కూడా ఉన్నారు. ఆ తర్వాత గ్రామానికే చెందిన ప్రేమ్ కుమార్‌తో మల్లిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అక్బర్‌కు తెలియడంతో అతనితో విడాకులు తీసుకొని పిల్లలను వదిలేసి ప్రేమ్ కుమార్‌తో గుంటూరు వచ్చేసింది. ప్రేమ్ కుమార్‌ను వివాహం చేసుకొని గుంటూరులో కాపురం పెట్టింది.
తెలంగాణ రాష్ట్రం గ్రీన్ పవర్ రంగంలో అద్భుత విజయాలను సాధించి, దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాంకేతికత, ఫార్మాస్యూటికల్స్, ఉత్పత్తి, వ్యవసాయా రంగాల అభివృద్ధికి కేంద్రంగా ఉద్భవించిందని తెలిపారు.
హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ సభ నిర్వహించారు. ముఖ్య అతిధిగా జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. 80 బీసీ సంఘాల నాయకులు కూడా సభకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు యధావిధిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ మధురానగర్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా మహిళా శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి పురోగతిని, పని తీరును, పథకాల అమలును మంత్రి సమీక్షించారు. అంగన్వాడి కేంద్రాల సొంత భవనాల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాటలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. నీది నాలుక తాటి మట్ట.. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు కేసీఆర్ కుటుంబంతో కూడి పొగిడిన వ్యక్తివి నువ్వు కాదా అని దుయ్యబట్టారు. అవకాశవాది నుంచి అవినీతి మాట రావడం సిగ్గుచేటు అని అన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న రేవంత్ రెడ్డి సానుభూతి పొందడానికే తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రాజయ్య అన్నారు.
చదువుల దేవాలయానికి హిందూత్వ వాదానికి ఆద్యుడైన సవార్కర్ పేరు పెట్టడం పూర్తి అభ్యంతరకరమని సీపీఐ నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. మతాన్ని ఆధారంగా సమాజాన్ని విభజించే వాదాన్ని ప్రేరేపించి, భారత స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో గాంధీ అహింసాయుత క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన చరిత్ర కలిగిన సవార్కర్ పేరు పెట్టడం ఏంటి..? అని ప్రశ్నించారు.
ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క జెండా ఊపి 25 సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భార్యభర్తలు రోజంతా పనిచేసినా.. సాయంత్రం భార్య మాత్రమే ఇంట్లో పని ఎందుకు చేయాలి.. ఇద్దరూ చేయాల్సిందేనని అన్నారు. మహిళా సంఘాలకు లోన్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 17 రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం.. నాణ్యత, మంచి రుచితో ఆరోగ్యకరమైన చేపల వంటకాలు తయారు చేయండని సూచించారు.
హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్‌లో పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. డీఎస్పీ, ఇంటర్నేషనల్ బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొన్నారు. ఆమెతో పాటు డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీలో జరుగుతోంది. తొలి రెండు సెషన్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్రస్తుతం రిషబ్ పంత్‌తో పాటు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నాడు. అయితే.. సిడ్నీ పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పిచ్ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలో రిషబ్ పంత్ చేతికి గాయం అయింది.