తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. రేపు (శుక్రవారం) రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది జనవరి 3న సావిత్రిబాయి ఫులే జయంతిని మహిళా టీచర్స్ డే నిర్వహించాలని ఉత్తర్వుల్లో తెలిపింది. అన్ని జిల్లాల కలెక్టర్లు శుక్రవారం సావిత్రి భాయి ఫూలే జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖకు సూచించారు. ఇందుకోసం అయ్యే ఖర్చును విద్యా శాఖ బడ్జెట్ నుంచి కేటాయించాలని తెలిపింది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ కూడా అవసరమైన చర్యలకు తక్షణమే తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే తన సతీమణి సావిత్రి భాయి ఫూలేకు చదువు నేర్పించి ఆమె ద్వారా మహిళలకు చదువు నేర్పించారు. సావిత్రి భాయి ఫూలేను ఫస్ట్ ఉమెన్ టీచర్ అని చెప్తారు. మహిళల విద్య కోసం సావిత్రిబాయి ఫులే చేసిన కృషిని గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. విద్యాబోధనలో ప్రతిభ కనబరిచిన ఉమెన్స్ టీచర్లను ఘనంగా సత్కరించనున్నారు.
Read Also: Glopixs : మార్కెట్ లోకి కొత్త ఓటీటీ ఫ్లాట్ ఫాం ‘గ్లోపిక్స్’
సావిత్రి బాయి పూలే ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా పూలె దంపతుల సేవలను త్యాగాలను గుర్తు చేసుకున్నారు. భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పుకు సావిత్రీబాయి ఫూలే పునాది వేశారని అన్నారు. మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించి, అణచివేయబడిన వర్గాలకు న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని ఆర్పించారని గుర్తు చేసుకున్నారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. సావిత్రీబాయి ఆశయాలను సాధించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. మహిళల సాధికారత, ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాల వృద్దికి ప్రజా ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బీసీలు, బడుగు, బలహీన వర్గాల సామాజిక, రాజకీయ అభ్యున్నతికి రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి సర్వేను ఇటీవలే పూర్తి చేసిందని తెలిపారు. మహిళలను అక్షరాస్యులను చేయడానికి సావిత్రిబాయి ఫూలె ఎంతో శ్రమించారని, ఆమె త్యాగాన్ని, కృషికి గుర్తింపుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళ టీచర్లు సావిత్రి భాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతి ఏడాది ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Blinkit: అంబులెన్స్ సేవలు ప్రారంభించిన బ్లింకిట్.. కాల్ చేసిన టెన్ మినిట్స్‌లోనే..!
సావిత్రీబాయి ఫులే 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. సావిత్రీబాయి చిన్న వయసులోనే సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త జ్యోతిబానును వివాహం చేసుకున్నారు. ఆమె తొమ్మిదో ఏట వివాహం చేసుకుంది. అలాగే.. జ్యోతిబా వయస్సు 13 సంవత్సరాలు. పెళ్లి జరిగినప్పుడు సావిత్రిబాయికి చదువు రాదు. ఆమె భర్త తనకు గురువుగా మారి ఇంట్లోనే చదవడం, రాయడం నేర్పించారు. ఆ సమయంలో స్త్రీలను విద్యకు దూరంగా ఉంచే కఠిన నిబంధనలు ఉండేవి.. అయినప్పటికీ సావిత్రిబాయి దంపతులు చదువు నేర్చుకునే విషయంలో అస్సలు వెనకాడలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సావిత్రి చదువు పూర్తి చేశారు. అంటరానితనాన్ని ఎదుర్కొన్నప్పటికీ తన ప్రయాణాన్ని ఆపలేదు. సావిత్రిబాయి పూణే, అహ్మదాబాద్‌లలో ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమంలో చేరారు. ఆ తర్వాత.. తన భర్త జ్యోతిరావు ఫూలేతో కలిసి భారతదేశపు తొలి బాలికల పాఠశాలను ప్రారంభించారు. పితృస్వామ్య అడ్డంకులను ఛేదించి భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా నిలిచారు. 1851 నాటికి సావిత్రీబాయి ఫూలే పూణేలో మహిళల కోసం మూడు పాఠశాలలను స్థాపించారు. అందరికీ విద్య అందాలనే తన నిబద్దతను చాటిచెప్పారు. తన భర్తతో కలిసి బాలికల విద్యావ్యవస్థను రూపొందించి, అనేక సామాజిక నిబంధనలను మార్చేందుకు దోహదపడ్డారు సావిత్రీబాయి.
Read Also: Adani bribery case: అదానీకి అమెరికా షాక్.. సంయుక్త విచారణకు ఆదేశం..