పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటు చేసిన సిట్ బృందంలో ప్రభుత్వం మార్పులు చేసింది. అక్రమ రవాణా కేసుల దర్యాప్తు, విచారణ కోసం గతంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. అయితే సిట్ బృందంలో కొందరు సభ్యుల నియామకంపై వచ్చిన అభ్యంతరాలపై సిట్‌లో మార్పులు జరిగాయి. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సుల మధ్య సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ఎవరు ఏమి చేసినా తన ఖాతాలో వేసుకోవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో కోటి ఎకరాలు సాగులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఏపీలో జలయజ్ఞం పేరిట 23 ప్రాజెక్టులు పూర్తి చేశారని అన్నారు. చంద్రబాబు అన్నీ నేనే చేశా అంటాడు.. పోలవరం నాదే అంటారు.. హంద్రీనీవా నాదే అంటారు..
విశాఖలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్స్ ఫెయిల్ కావడంతో లారీ ఓ షాపులోకి దూసుకెళ్లింది. గాజవాక సుందరయ్య కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెంకట రమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఓయువతి తప్పించుకుంది.
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ కుమార్, సాల్మన్ ఆరోక్య రాజ్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఈ ఇద్దరు అధికారులకు ముఖ్య కార్యదర్శి హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్ కుమార్ ను రీడిజిగ్నెట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
ఫార్ములా ఈ- కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో.. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం తెలిపింది.
హైదరాబాద్ నగరంలో వాహనదారులను లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇద్దరు కిలాడీ లేడీలు.. ఆ మహిళలను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన భాగ్య, సఫీల్‌గూడకు చెందిన వెన్నెల బంధువులు. గత కొంతకాలంగా వీరు వాహనాలపై వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
గత ప్రభుత్వం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కేంద్ర నిధులన్నీ మింగేశారు.. నిధులన్నీ పక్కదారి పట్టించారని తెలిపారు. మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రతి ఇంటికి కులాయి ద్వారా నీరు ఇవ్వాలని ఏర్పాటు చేసిన స్కీము నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. తొందరపాటు చర్యలు వద్దని.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశం ఇచ్చింది. ఈ క్రమంలో.. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాయం కేసులో ఏ6గా పేర్ని నాని ఉన్నారు. దీంతో.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.
గత 25 రోజులుగా సర్వ శిక్షా ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెకు దిగారు. ఈ క్రమంలో.. ఉద్యోగుల ప్రతినిధులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్సీ కోదండరాం, విద్యాశాఖ అధికారులు చర్చలు నిర్వహించారు.