Mahesh Kumar Goud: అధికారం పోయిన తర్వాత బీసీలపై కపట ప్రేమ చూపుతున్నారు..
- ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ ప్రెసిడెంట్ ప్రశ్నాస్త్రాలు
- ఎమ్మెల్సీ కవిత వీటికి జవాబు చెప్పి ధర్నా చేయాలి- మహేష్ కుమార్ గౌడ్
- టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్సీ కవిత జవాబు చెప్పి ధర్నా చేయాలని తెలిపారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీసీలను వంచించడమే కాకుండా వారికి అందాల్సిన నిధులను ఖర్చు చేయకుండా నిట్టనిలువునా ముంచిందని ఆరోపించారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బీసీలపై కపట ప్రేమ చూపుతూ.. కల్వకుంట్ల కుటుంబం వారిపై మొసలికన్నీరు కారుస్తోందని పేర్కొన్నారు. బీసీలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదు.. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్‌కు బీసీలు గుర్తుకొచ్చారని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసి వారి గొంతు కోసింది బీఆర్ఎస్సేనని అన్నారు.
Israel-Hamas: హమాస్ భద్రతా దళాల అధిపతిని లేపేసిన ఇజ్రాయెల్
Also Read
- డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
- India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్‌పై ప్రతీకారమే మిగిలింది..!
- FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్‌లోకి స్పెయిన్.!
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్‌లు..! ప్రత్యేక మెకానిజం
లిక్కర్ స్కాంలో మరకంటించుకున్న ఎమ్మెల్సీ కవిత.. దాన్ని పోగొట్టుకోవడానికి రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడానికి ఇప్పుడు బీసీల పేరిట కపట నాటకం మొదలుపెట్టారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీలు ఈ కుట్రలను గమనించి బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నామని అన్నారు. కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేస్తుందనడానికి నిదర్శనం తనను తెలంగాణ అధ్యక్షులుగా నియమించడమేనని చెప్పారు. గత మీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా బీసీలకు ఎంత ప్రాధాన్యతిచ్చారో బహిరంగ రహస్యమేనని విమర్శించారు. బీసీల పేరుతో ధర్నా చేయాలని నిర్ణయించిన మీకు.. టీపీసీసీ అధ్యక్షులుగా నేను కొన్ని ప్రశ్నలను సంధిస్తున్నాను. మీరు వీటికి సరైన సమాధానం చెబుతారని ఆశిస్తున్నానని అన్నారు.
1) కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 23 శాతం నుండి 42 శాతానికి పెంచడం కోసం చర్యలు తీసుకొని, అందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందుకు మీరు ధర్నా చేస్తున్నారా..?
2) బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ద్వారా పంచాయతీలు, మున్సిపాల్టీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు ప్రాతినిథ్యం లభించే అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?
3) స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు చర్యలు చేపడుతున్నందుకు ధర్నా చేస్తున్నారా..?
4) స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించడానికి గాను ప్రజా ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?
5) జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేందుకు రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?
6) గత బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమ బడ్జెట్ను 2971.32 కోట్ల రూపాయలకు పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?
7) కాంగ్రెస్ ప్రభుత్వం గీతన్నల ఆవేదనను గుర్తించి తాడి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?
8) గీతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కార్మక్రమాన్ని ప్రారంభించినందుకు ధర్నా చేస్తున్నారా..?
9) బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 10 సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?
10) ఎమ్బీసీ కార్పొరేషన్కు రూ.400 కోట్లు కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?
11) మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల్లోని వివిధ విభాగాల్లో 5136 మంది ఉద్యోగులను నూతనంగా నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?
12) బీసీ హాస్టళ్లకు పక్కా భవనాల నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే 20 నిర్మాణాలకు కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?
13) గురుకులాల్లో డైట్ కాస్మోటిక్ చార్జీలు 40 శాతానికి పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?
14) 28 యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూల్స్ నూతనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నందుకు ధర్నా చేస్తున్నారా..?
15) బీసీ కార్పొరేషన్ కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 73 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?
CMR College: సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వార్డెన్ సస్పెండ్..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. వారికి మరింత ప్రయోజనకరంగా ఉండేలా సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి ధర్నా చేపట్టడం దురదృష్టకరమని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీసీల అభివృద్ధి కోసం పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన చర్యలు.. ప్రస్తుతం ఏడాది కాంగ్రెస్ ప్రజా పాలనలో చేపట్టిన చర్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కవితను బీఆర్ఎస్ నేతలను సవాలు చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు తెలిపారు.
- Tags
- bc
- BC Dharna
- BRS
- MLC Kavitha
- telugu news
తాజావార్తలు
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
-
Shabad M*urder Case: రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు.. ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి..
-
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!