హైదరాబాద్‌లోని పాతబస్తీ, మదన్నపేట, ఉప్పర్ గూడాకి చెందిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. శబరిమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎరుమెలి నుండి పంపా నది శబరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గురు స్వామి రాంపాల్ యాదవ్, అభి యాదవ్, రామ్ యాదవ్, పెద్ది యాదవ్‌ల ఆధ్వర్యంలో వెళ్తున్న అయ్యప్ప స్వాములు బస్సు పంపా నదికి 15 కిలోమీటర్ల దూరంలోని ఘాట్ రోడ్డులో బోల్తా పడింది.
Read Also: Tomato Price Drop: భారీగా టమాటా ధరల పతనం.. ధర లేకపోవడంతో పంట తగలబెట్టిన రైతు
ఘాట్ రోడ్డు మలుపులో అదుపు తప్పి బోల్తా పడ్డ బస్సు.. మూడు చెట్లపై ఒరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 22 మంది అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. తీవ్రగాయాల పాలైన డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి (51) చెందాడు. మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో ఉంచారు. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వాహనం మూలమలుపు వద్ద కిందకు దిగుతుండగా అదుపు తప్పి వాహనం బోల్తా పడింది.
Read Also: Bhairavam : ‘భైరవం’ మూవీలో ఓ వెన్నెల సాంగ్ లాంచ్ చేయనున్న న్యాచురల్ స్టార్