నేడు తెలంగాణ గ్రీన్ & రెన్యువబుల్ ఎనర్జీ పాలసీపై భాగస్వాములతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండును తీర్చడానికి.. జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోవడానికి.. తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రతిపాదిస్తుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
Read Also: Cold Wave: ఉమ్మడి మెదక్ జిల్లాను వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. వివిధ రంగాలలో విస్తరించి ఉన్న విభిన్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. రాష్ట్రం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల వల్ల.. తెలంగాణ గరిష్ట విద్యుత్ డిమాండ్ 2023-24లో 15,623 మెగావాట్ల నుండి 2027-28లో 20,968 మెగావాట్లకు.. 2034-35లో 31,809 మెగావాట్లకు పెరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ అవసరాలు 2023-24లో 85,644 మిలియన్ యూనిట్ల నుండి 2027-28లో 1,15,347 మిలియన్ యూనిట్లకు.. 2034-35లో 1,50,040 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.
Read Also: Girls Missing: నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం..
తెలంగాణ రాష్ట్రాన్ని 2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయడమే లక్ష్యమని భట్టి విక్రమార్క తెలిపారు. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండును తీర్చడానికి.. జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోవడానికి ఈరోజు భాగస్వాములతో డిప్యూటీ సీఎం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో జరుగనుంది.