ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత ఇప్పటికే జైలుకు వెళ్లింది.. కేటీఆర్ కూడా రేపో మాపో అరెస్టు అవుతారని అన్నారు. హరీష్ రావు, కేసీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. చిల్పూర్ మండలం మల్కాపూర్ లో గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే.. కల్వకుంట్ల కుటుంబం, మాజీ ఎమ్మెల్యే రాజయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం పది సంవత్సరాల పాలనలో కొత్త రకమైన అవినీతికి తెరలేపిందని ఆరోపించారు. సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ.. లిక్కర్ కుంభకోణంలో ఎన్ని రోజులు తీహార్ జైల్లో ఉందో అందరికీ తెలిసిందేనని తెలిపారు.
Read Also: Game Changer: పూర్ గూజ్ బంప్స్.. గేమ్ చేంజర్ ట్రైలర్ అదిరింది బాసూ!
రేపో, మాపో ఫార్ములా ఈ- రేసులో కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని కడియం శ్రీహరి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పూర్తి కాగానే.. కేసీఆర్‌తో పాటు హరీష్ రావు కూడా జైలుకి వెళ్లాల్సిందేనని జోస్యం చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం వివిధ కేసుల్లో ఇరుక్కుని.. కొందరు జైలు ఊచలు లెక్కపెట్టి వస్తే, మరికొందరు జైలు ఊచలు లెక్క పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబానికి 2014కు ముందు ఉన్న ఆస్తులు.. ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంతో ప్రకటించాలని అన్నారు. దళిత బందులో కమిషన్ తీసుకున్నవారు.. నీతులు మాట్లాడడం హాస్యాస్పదం అని తెలిపారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారు నీతులు మాట్లాడడం విడ్డూరం అని దుయ్యబట్టారు. కడియం శ్రీహరి తప్పు చేస్తే ఆధారాలు చూపించండి.. ఇకనైనా సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు.
Read Also: Bengaluru: ఎయిర్‌పోర్టులో పగిలిన పైపు లైన్.. జలమయమైన కార్యాలయాలు