Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..
- చర్చనీయాంశంగా మోనాలిసా-ఫర్మాన్ ఖాన్ వివాహం..
- దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన పెళ్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monalisa- Farman Khan: మహా కుంభమేళా సమయంలో వైరల్‌గా మారిని మోనాలిసా భోంస్లే మరోసారి వార్తల్లో నిలిచింది. మార్చి 11న కేరళలోని అరుమనూర్‌లోని నాయనార్ ఆలయంలో తన ముస్లిం బాయ్‌ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ వివాహం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొందరు దీనిని ‘‘లవ్ జిహాద్’’ అని ఆరోపించారు. అయితే, కొత్త జంట ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది.
ఫర్మాన్ ఖాన్ ఎవరు.?
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాకు చెందిన ఫర్మాన్, మలయాళం, హిందీ, తమిళ చిత్రాలలో నటుడిగా పనిచేస్తున్నారు. ఇద్దరం ఆరు నెలల నుంచి డేటింగ్ చేస్తున్నామని మోనాలిసా వెల్లడించింది. వీరిద్దరు సోషల్ మీడియా ద్వారా కలిశారు. ఆ తర్వాత ఒక సినిమా సెట్‌లో కలిశారు. అప్పటి నుంచి స్నేహం ఆ తర్వాత ప్రేమ, పెళ్లికి దారి తీసింది. పి బిను వర్గీస్ దర్శకత్వం వహించిన నాగమ్మ అనే మలయాళ మూవీ సెట్స్‌లో వీరిద్దరు కలుసుకున్నారు. ఈ సినిమాలో ఫర్మాన్ ఖాన్ విలన్‌గా మోనాలిసా లీడ్ క్యారెక్టర్‌గా నటించారు.
నాటకీయంగా పెళ్లి:
వివాహానికి ముందు వీరిద్దరు కేరళ పోలీసుల సాయాన్ని కోరారు. మోనాలిసా, ఫర్మాన్ కేరళలో పనిచేస్తు్న చిత్ర బృందంతో కలిసి పోలీస్ స్టేషన్ వచ్చారు. మోనాలిసా కుటుంబీకులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మోనాలిసా తన తండ్రితో వెళ్లేందుకు నిరాకరించింది, ప్రియుడితోనే ఉంటానని చె ప్పింది. అతడిని వావాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు పోలీసుల ముందు వెల్లడించింది. ఆమె మేజర్ కావడంతో ఆమె ఇష్ట ప్రకారం నడుచుకునే హక్కు ఉందని పోలీసులు చెప్పారు.
రాజకీయ నాయకుల ఆశీర్వాదంతో వివాహం:
ఇద్దరి వివాహ వేడుకకు వి శివన్‌కుట్టి, ఎంవి గోవిందన్, ఎఎ రహీమ్‌తో సహా అనేక మంది రాజకీయ నాయకులు హాజరైనట్లు తెలుస్తోంది. రహీమ్ మాట్లాడుతూ.. కేరళ సామాజిక సామరస్యానికి ప్రతీక అని అన్నారు. “రాజ్యాంగం వివిధ మతాల ప్రజలు వివాహం చేసుకోవడానికి అనుమతిస్తుంది. మేము ఈ జంటతో కలిసి వేడుకలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాము” అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?