చైనాలో గుర్తించిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా. పద్మావతి తెలిపారు. ఈ వైరస్ కారణంగా ప్రజలెవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా.. కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రైతు భరోసాపై సంచలన ప్రకటన చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలుపైగా ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా.. కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో ఉదయం పావురాలను ఎగురవేస్తుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఇష్యూలో ముగ్గురు వ్యక్తులపై పరిగి పోలీసులు కేసు నమోదు చేశారు. గేమింగ్ యాక్ట్ బర్డ్స్ క్రుయాల్టీ యాక్ట్ లా కింద కేసు నమోదు చేశారు. 100 కిలోమీటర్లు ప్రైజ్ మనీ.. తర్వాత 200 కిలోమీటర్ల ప్రైస్ మనీ.. తర్వాత 300 కిలోమీటర్ల ప్రైస్ మనీ ఇలా బెట్టింగులకు పాల్పడుతున్నారు.
హైదరాబాద్ లాలాగూడ పీస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తల్లి మృతిని చూసి తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోగ్యం బాగా లేక తల్లి లక్ష్మి మృతి చెందింది. తల్లి మృతిని చూసి తట్టుకోలేక కుమారుడు అభినయ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ లెటర్ రాశాడు.
చైనాలో హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (hMPV) వ్యాప్తిపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ DGHS, NCDC డైరెక్టర్, కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటనను విడుదల చేసింది. మెటాన్యూమోవైరస్ (hMPV) అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లాగానే ఉంటుందని తెలిపింది. ఇది శీతాకాలంలో జలుబు మరియు ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది.. ప్రత్యేకించి యువకులు, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది.
కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి విశ్వాసం, చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం.. కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు మళ్ళీ వస్తాయని అన్నారు. ఏడాది అయినా కేసీఆర్ జపం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం దివాలా తీసిందని చెప్పే ముఖ్యమంత్రి.. పరిపాలన చేతకాకే మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు.
మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో వీడియో రికార్డుల కలకలం రేపుతోంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూం వద్ద ఓ యువకుడు వీడియో రికార్డ్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిగే చర్యలు తీసుకోవాలని హాస్టల్ ముందు స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటి పారుదల శాఖ) ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ పైన పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.