నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం కలకలం రేపుతోంది. నవీపేట్ మండలంలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. మండల కేంద్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు పాఠశాలకు వెళ్తొస్తామని చెప్పి మిస్సింగ్ అయ్యారు. అయితే.. విద్యార్థినులు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ అయిన విద్యార్థినులు కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవలికగా గుర్తించారు. ఈ ముగ్గురు విద్యార్థినులు స్థానిక గర్ల్స్ హై స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అమ్మాయిల జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు.. అమ్మాయిల మిస్సింగ్‌తో వారి కుటంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.